MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anitha58d7902b-f641-43e7-a76a-3c90213233a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anitha58d7902b-f641-43e7-a76a-3c90213233a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే.. ఇండస్ట్రీలో సక్సెస్ అయి నిలబడతారు. మరికొంతమంది హీరోయిన్లు సక్సెస్ కాలేక కెరీర్ ప్రారంభంలోనే వైదొలుగుతారు. మరికొంతమంది మంచి సినిమాలు హిట్ అయిన తర్వాత కూడా... పెద్దగా ఛాన్స్ ను దక్కించుకోలేక సతమతమవుతుంటారు. అయితే అలాంటి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇక ఈ కోవాలకే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిత కూడా వస్తారు. anitha{#}kiran;puneet rajkumar;uday kiran;Dussehra;Rohith Reddy;Vijayadashami;Prema Katha;Nuvvu Nenu;anitha singer;teja;Tollywood;Kannada;marriage;BEAUTY;Success;Heroine;Cinema"నువ్వునేను"తో బ్లాక్ బస్టర్‌..కానీ ఆ దర్శకుడి చేతిలో పడి కెరీర్‌ నాశనం చేసుకున్న హీరోయిన్‌ ?"నువ్వునేను"తో బ్లాక్ బస్టర్‌..కానీ ఆ దర్శకుడి చేతిలో పడి కెరీర్‌ నాశనం చేసుకున్న హీరోయిన్‌ ?anitha{#}kiran;puneet rajkumar;uday kiran;Dussehra;Rohith Reddy;Vijayadashami;Prema Katha;Nuvvu Nenu;anitha singer;teja;Tollywood;Kannada;marriage;BEAUTY;Success;Heroine;CinemaSun, 01 Dec 2024 09:57:00 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే.. ఇండస్ట్రీలో సక్సెస్ అయి నిలబడతారు. మరికొంతమంది హీరోయిన్లు సక్సెస్ కాలేక కెరీర్ ప్రారంభంలోనే వైదొలుగుతారు. మరికొంతమంది మంచి సినిమాలు హిట్ అయిన తర్వాత కూడా... పెద్దగా ఛాన్స్ ను దక్కించుకోలేక సతమతమవుతుంటారు. అయితే అలాంటి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇక ఈ కోవాలకే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిత కూడా వస్తారు.

హీరోయిన్ అనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉదయ్ కిరణ్ హీరోగా ఎదుగుతున్న సమయంలో అనిత బాగా పాపులర్ అయ్యారు. అనిత అసలు పేరు నటాషా. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత... అనితగా మారిపోయారు.  వాస్తవంగా కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించింది అనిత. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన.. వీర కన్నడిగా లో చేసి మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ...  2001 ఆ సమయంలో మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసింది. 2001లో నువ్వు నేను అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా లో ఉదయ్ కిరణ్ హీరోగా చేయగా.. అనిత హీరోయిన్గా నటించారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది.  ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో అనిత కెరీర్ ఒకసారిగా మారిపోయింది.

 ఇక నువ్వు నేను సినిమా తర్వాత శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్లికి రెడీ , తొట్టి గ్యాంగ్ అలాగే ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కానీ నువ్వు నేను సినిమా  లాగా ఏ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకున్నారు. 2013లో గోవాలో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ....  ప్రస్తుతం హిందీలో సీరియల్స్ చేస్తున్నారు. అయితే ఓ దర్శకుడి కారణంగా ఆమె కెరీర్ నాశనం అయిందని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. కానీ ఆ దర్శకుని పేరు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అంబానీ నుంచి ఆదాని వరకు .. వీరి మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>