Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplcac221fc-0816-410c-a33a-d90ffcb39d74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplcac221fc-0816-410c-a33a-d90ffcb39d74-415x250-IndiaHerald.jpgఐపీఎల్‌లో షైనింగ్ స్టార్‌గా మారిన 13 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ U19 ఆసియా కప్‌లో మాత్రం నిరాశపరిచాడు. బీహార్‌కు చెందిన ఈ క్రికెటర్ ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించారు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన వేలం రెండవ రోజు ఈ డీల్ జరిగింది. ipl{#}ali;Rajasthan;Australia;West Indies;Bihar;BCCI;Sooryavanshi;Parugu;Father;Pakistan;Sony;India13 ఏళ్లకే ఐపీఎల్‌లోకి.. కానీ పాక్‌పై చేసింది ఒక్క పరుగే?13 ఏళ్లకే ఐపీఎల్‌లోకి.. కానీ పాక్‌పై చేసింది ఒక్క పరుగే?ipl{#}ali;Rajasthan;Australia;West Indies;Bihar;BCCI;Sooryavanshi;Parugu;Father;Pakistan;Sony;IndiaSun, 01 Dec 2024 13:45:00 GMTఐపీఎల్‌లో షైనింగ్ స్టార్‌గా మారిన 13 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ U19 ఆసియా కప్‌లో మాత్రం నిరాశపరిచాడు. బీహార్‌కు చెందిన ఈ క్రికెటర్ ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించారు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన వేలం రెండవ రోజు ఈ డీల్ జరిగింది.

అయితే, తాజాగా U19 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. భారతదేశం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా వైభవ్ తొమ్మిది బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతన్ని పాకిస్తాన్ పేసర్ అలీ రజా ఐదో ఓవర్‌లో బౌల్డ్ చేశాడు. ఐపీఎల్ వేలంలో అంత పేరు తెచ్చుకున్న వైభవ్ చాలా బాగా ఆడతాడేమో అని అందరూ అనుకున్నారు. అయినప్పటికీ, అతని ప్రతిభపై అందరికీ నమ్మకం ఉంది. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా ఆడుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

వైభవ్ వయసు గురించి చాలా చర్చ జరుగుతోంది. కొంతమంది అతని వయసు 13 కాదు, 15 అని అనుకుంటున్నారు. అయితే, వైభవ్ తండ్రి సంజీవ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. వైభవ్‌కు 8.5 ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్ జరిగిందని, ఇప్పటికే భారతదేశ U19 జట్టుకు ఆడాడని చెప్పారు. "మేము మరొకసారి వయసు పరీక్ష చేయించడానికి భయపడం." అని ఆయన అన్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు, వైభవ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ తన లక్ష్యం గురించి చెప్పాడు. "నేను నా ఆటపైనే దృష్టి పెడుతున్నా, బయటి విషయాల గురించి ఆందోళన చెందట్లేదు. ఆసియా కప్‌లో బాగా ఆడాలని, ప్రతి మ్యాచ్‌ను ఒక విన్నింగ్ మ్యాచ్ ఇలా ఆడాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు. తనకు వెస్టిండీస్ లెజెండ్ లారా అంటే ఎంతో ఇష్టమని, లారాలా ఆడాలని ప్రయత్నిస్తున్నానని, కానీ తన ఆటను సహజంగా ఉంచుకుని స్కిల్స్ పెంచుకునే పనిలో ఉన్నానని వెల్లడించాడు.

వైభవ్ 2024 జనవరిలో 12 ఏళ్లు 284 రోజుల వయసులోనే బీహార్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 100 పరుగులు చేశాడు. అతని బెస్ట్ స్కోరు 41. గత నెలలో చెన్నైలో ఆస్ట్రేలియా U19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 58 బంతుల్లో శతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ తప్ప ఇంకెవరిని ఊహించలేని సినిమా అనేలా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>