PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/mohan-babu777e4110-d957-4fb3-9af6-bd68d4a79ea9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/mohan-babu777e4110-d957-4fb3-9af6-bd68d4a79ea9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... సినీ ప్రముఖులందరూ చంద్రబాబు వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు వైసిపి పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా.. బయటికి వచ్చేస్తున్నారు. నారా లోకేష్ లాంటి నేతలను కలిసి టిడిపిలోకి జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మంచు కుటుంబం కూడా... తెలుగుదేశం పార్టీ బాట పట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. mohan babu{#}Nara Lokesh;U Turn;editor mohan;Lokesh;mohan babu;Lokesh Kanagaraj;Hanu Raghavapudi;NTR;YCP;Episode;Prime Minister;Party;Government;Minister;News;Bharatiya Janata Party;Telugu Desam Party;CBN;TDPటీడీపీలోకి మంచు కుటుంబం.. ?టీడీపీలోకి మంచు కుటుంబం.. ?mohan babu{#}Nara Lokesh;U Turn;editor mohan;Lokesh;mohan babu;Lokesh Kanagaraj;Hanu Raghavapudi;NTR;YCP;Episode;Prime Minister;Party;Government;Minister;News;Bharatiya Janata Party;Telugu Desam Party;CBN;TDPSun, 01 Dec 2024 08:24:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... సినీ ప్రముఖులందరూ చంద్రబాబు వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు వైసిపి పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా.. బయటికి వచ్చేస్తున్నారు. నారా లోకేష్ లాంటి నేతలను కలిసి టిడిపిలోకి జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మంచు కుటుంబం కూడా... తెలుగుదేశం పార్టీ బాట పట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మంచు మోహన్ బాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. గతంలో టిడిపి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే...  తెలుగుదేశం పార్టీలో చేరారు మంచు మోహన్ బాబు. 1994 సంవత్సరంలో ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత రాజ్యసభకు కూడా పంపించారు. కానీ 1995 ఎపిసోడ్ నేపథ్యంలో...  యూటర్న్ తీసుకున్న మంచు మోహన్ బాబు... చంద్రబాబు వైపు వెళ్ళిపోయారు.


ఇక అక్కడ కూడా ఉండలేక బిజెపి వైపు వెళ్లిపోయారు మంచు మోహన్ బాబు. 1998 సంవత్సరంలో... బిజెపి పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు.  ఇక 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత...  బిజెపికి మరింత దగ్గరయ్యారు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు. ఇక 2019 ఎన్నికల తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మంచు మోహన్ బాబు మళ్లీ యూ టర్న్ తీసుకొని వైసిపి వైపు వెళ్లారు.

 
ఇలా అధికారం ఏ పార్టీ వద్ద ఉంటే అక్కడికి వెళ్లిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.  అందుకే మంచు కుటుంబం మొత్తం ఇప్పుడు తెలుగు దేశం పార్టీ వైపు చూస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు... మంత్రి నారా లోకేష్ ను కలవడం జరిగింది. అయితే.. ఈ సమావేశం నేపథ్యంలో టిడిపిలోకి మంచు మోహన్ బాబు కుటుంబం వెళ్తుందని ప్రచారం జరుగుతోంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఇంట్రెస్టింగ్ మూవీలో కిరణ్ అబ్బవరం.. టైటిల్ అదిరిందిగా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>