DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/nagababue72fc131-ea04-4cfb-9c59-33e756d9315e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/nagababue72fc131-ea04-4cfb-9c59-33e756d9315e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్య సభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ.. కూటమి పార్టీలు ఆ మూడు స్థానాలూ ఎలా పంచుకోబోతున్నాయనే.. ఎవరిని ఎన్నుకోబోతున్నాయనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు. జనసేన నేత కొణిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోందని.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఈ విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించారని.. ఖళీ అయిన రాజ్యసభ స్థానాలnagababu{#}రాజీనామా;Konidela Production;Nagababu;Election Commission;gold;Rajya Sabha;Bharatiya Janata Party;CM;Service;Andhra Pradesh;YCP;Delhiరాజ్యసభ నాగబాబుకే? కన్ఫర్మ్ చేసిన పవన్ కల్యాణ్?రాజ్యసభ నాగబాబుకే? కన్ఫర్మ్ చేసిన పవన్ కల్యాణ్?nagababu{#}రాజీనామా;Konidela Production;Nagababu;Election Commission;gold;Rajya Sabha;Bharatiya Janata Party;CM;Service;Andhra Pradesh;YCP;DelhiSat, 30 Nov 2024 12:34:00 GMTప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్య సభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ.. కూటమి పార్టీలు ఆ మూడు స్థానాలూ ఎలా పంచుకోబోతున్నాయనే.. ఎవరిని ఎన్నుకోబోతున్నాయనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు.


జనసేన నేత కొణిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోందని.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఈ విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించారని.. ఖళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరగా, అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారని కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ లో ఓ పోస్ట్ వెలిసింది. "అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు.. అతని ప్రతి పనీ ప్రజా శ్రేయస్సు కోసమే.. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడూ దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు" అని నాగబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.


ఇదే సమయంలో... "ఢిల్లీ వెళ్లిన ప్రయోజనం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు.. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం.. అలాంటి నాయకుడి కోసం నా జీవితాన్ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.. మా నాయకుడికి సేవ చేయడం కంటే నాకు ఇతర రాజకీయ లక్ష్యాలు ఏమీ లేవు" అంటూ నాగబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.


కాగా... ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. దీంతో... కూటమి పార్టీల మధ్య రాజ్యసభ హీట్ రాజుకుందని అంటున్నారు. ఈ మూడు స్థానాల్లోనూ ఒకటి టీడీపీ, మరొకటి జనసేనకూ ఖరారవ్వగా... మూడో సీటు కోసం బీజేపీ-టీడీపీ మధ్య పోటీ నెలకొందని అంటున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప1 కి జరిగినట్లే పుష్ప2 కి కూడా..సేమ్ టూ సేమ్..మళ్ళీ అదే రిపీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>