Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ విజయ్ అలాగా! అయితే అతను పాలిటిక్స్ లోకి వస్తున్నానని చెప్పి సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు. దీంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా అడుగుపెడుతున్నట్లు ప్రకటించి అందరిలో హ్యాపీనెస్ నింపాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తన తండ్రిలాగానే సినిమా రంగంలో తనదైన ముద్ర వేయడానికి జేసన్ సిద్ధమయ్యాడు. Dalapati Vijay{#}lyca productions;sundeep kishan;thaman s;Sangeetha;Degree;Joseph Vijay;Dalapathi;Music;you tube;Audience;Pawan Kalyan;Tamil;Cinemaతండ్రి రాజకీయాల్లోకి.. కొడుకు సినిమాల్లోకి.. దళపతి విజయ్ కొడుకు ఎంట్రీ ఫిక్స్?తండ్రి రాజకీయాల్లోకి.. కొడుకు సినిమాల్లోకి.. దళపతి విజయ్ కొడుకు ఎంట్రీ ఫిక్స్?Dalapati Vijay{#}lyca productions;sundeep kishan;thaman s;Sangeetha;Degree;Joseph Vijay;Dalapathi;Music;you tube;Audience;Pawan Kalyan;Tamil;CinemaSat, 30 Nov 2024 10:08:00 GMTతమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ విజయ్ అలాగా! అయితే అతను పాలిటిక్స్ లోకి వస్తున్నానని చెప్పి సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు. దీంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా అడుగుపెడుతున్నట్లు ప్రకటించి అందరిలో హ్యాపీనెస్ నింపాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తన తండ్రిలాగానే సినిమా రంగంలో తనదైన ముద్ర వేయడానికి జేసన్ సిద్ధమయ్యాడు.

లైకా ప్రొడక్షన్స్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమా గురించి ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ఒక్క నిమిషం వీడియో తన అద్భుతమైన దృశ్యాలు, సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా, సందీప్ కిషన్ హీరోగా, తమన్ సంగీతంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా 'జేసన్ సంజయ్ 01' అనే టైటిల్‌తో 2023లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికి సిద్ధమైంది. లైకా ప్రొడక్షన్స్ సుబాస్కరన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.

జేసన్ సంజయ్ 2018-2020 మధ్య టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ చదివారు. ఆ తర్వాత 2020- 2022 మధ్య లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ చేశారు. ఇప్పటికే 'పుల్ ది ట్రిగ్గర్' అనే చిన్న సినిమాను తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన జీకేఎం తమిళ కుమరన్ మాట్లాడుతూ, జేసన్ చెప్పిన కథ చాలా కొత్తగా ఉందని, భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అన్నారు. ధనుష్‌తో కలిసి ‘రాయన్’ సినిమాలో నటించిన సందీప్ కిషన్ కూడా జేసన్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

" style="height: 573px;">
















మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ధనుష్ తో ఎఫైర్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ .. ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>