Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/played-only-6-matches-but-the-retirement-of-the-indian-cricketerc0dad751-9b0b-4354-9ae2-2a34007454f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/played-only-6-matches-but-the-retirement-of-the-indian-cricketerc0dad751-9b0b-4354-9ae2-2a34007454f8-415x250-IndiaHerald.jpgభారతీయ క్రికెట్ జట్టు తరఫున ఫాస్ట్ బౌలింగ్ చేసే సిద్ధార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితానికి గుడ్‌బై చెప్పారు. 34 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018లో భారత జట్టులోకి ఎంపికైన సిద్ధార్థ్, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంటే అతను ఆడింది కేవలం ఆరు మ్యాచ్లో అప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పేసే అందరికీ షాక్ ఇచ్చాడు. సిద్ధార్థ్ కౌల్ తన దేశవాళీ క్రికెట్ జీవితంలో మంచి పర్ఫామెన్స్ కనబరిచాడు. పంజాబ్ జట్టు తరఫున 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి, indian cricketer{#}ICC T20;Punjab;Hyderabad;Siddharth;Delhi;VIRAT KOHLI;Cricket;Indiaఆడింది 6 మ్యాచులే.. కానీ అంతలోనే భారత క్రికెటర్ రిటైర్మెంట్?ఆడింది 6 మ్యాచులే.. కానీ అంతలోనే భారత క్రికెటర్ రిటైర్మెంట్?indian cricketer{#}ICC T20;Punjab;Hyderabad;Siddharth;Delhi;VIRAT KOHLI;Cricket;IndiaFri, 29 Nov 2024 15:00:00 GMTభారతీయ క్రికెట్ జట్టు తరఫున ఫాస్ట్ బౌలింగ్ చేసే సిద్ధార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితానికి గుడ్‌బై చెప్పారు. 34 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018లో భారత జట్టులోకి ఎంపికైన సిద్ధార్థ్, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంటే అతను ఆడింది కేవలం ఆరు మ్యాచ్లో అప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పేసే అందరికీ షాక్ ఇచ్చాడు. సిద్ధార్థ్ కౌల్ తన దేశవాళీ క్రికెట్ జీవితంలో మంచి పర్ఫామెన్స్ కనబరిచాడు. పంజాబ్ జట్టు తరఫున 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 297 వికెట్లు పడగొట్టాడు. 17 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఆయన విశేషం. అదేవిధంగా లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్‌లలో కూడా చాలా వికెట్లు తీశాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఆయన ఎకానమీ రేటు చాలా బాగుంది.

2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో అండర్-19 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న టీం లో కూడా సిద్ధార్థ్ కౌల్ ప్రతిభ కనబరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో ట్రోఫీని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు కూడా ఆయన ఆడాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లలో 58 వికెట్లు తీశాడు. కానీ, 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఎవరూ ఆయన్ని కొనుగోలు చేయకపోవడంతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.

సిద్ధార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితం గురించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు. "పంజాబ్‌లో చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు భారతదేశం తరఫున ఆడాలని కలలు కనేవాడిని. 2018లో నా కల నిజమైంది. టీ20లో 75వ క్యాప్‌ను, వన్డేలో 221వ క్యాప్‌ను అందుకున్నాను" అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, జట్టు సహచరులు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. తన కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాల గురించి కూడా ప్రస్తావించాడు. తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, క్రికెట్ జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగుతాను అని చెప్పాడు. తన క్రికెట్ జీవితం గురించి ఎప్పటికీ గర్విస్తానని అన్నాడు.


" style="height: 35px;">













మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నీ పరమేశ్వరుడే చూసుకుంటాడు.. కన్నప్ప వాయిదాపై విష్ణు రియాక్షన్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>