MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-flop-mega-conspiracy-sensational-things-come-to-lighte3a66df4-d44b-4a99-b08f-fcb2cefd19a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-flop-mega-conspiracy-sensational-things-come-to-lighte3a66df4-d44b-4a99-b08f-fcb2cefd19a9-415x250-IndiaHerald.jpgఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. వైసీపీకి మద్దతు ప్రకటించారు. నంద్యాల నుంచి పోటీ చేసిన తన స్నేహితుడు గెలవాలని తన భార్య స్నేహారెడ్డితో వెళ్లి మరి మద్దతు తెలిపి వచ్చారు. అదే టైంలో వైసీపీపై గత మూడేళ్లుగా ఎడతెగని పోరాటం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తుంటే.. అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.. మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. allu arjun{#}kalyan;Janasena;Nagababu;Nandyala;Audio;Yevaru;Wife;Cinema;Allu Arjun' పుష్ప 2 ' ఫ్లాప్‌కు మెగా కుట్ర.. సంచలన విషయాలు వెలుగులోకి.. !' పుష్ప 2 ' ఫ్లాప్‌కు మెగా కుట్ర.. సంచలన విషయాలు వెలుగులోకి.. !allu arjun{#}kalyan;Janasena;Nagababu;Nandyala;Audio;Yevaru;Wife;Cinema;Allu ArjunFri, 29 Nov 2024 12:41:01 GMTటాలీవుడ్‌లో ప్రస్తుతం మెగా వెర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. వైసీపీకి మద్దతు ప్రకటించారు. నంద్యాల నుంచి పోటీ చేసిన తన స్నేహితుడు గెలవాలని తన భార్య స్నేహారెడ్డితో వెళ్లి మరి మద్దతు తెలిపి వచ్చారు. అదే టైంలో వైసీపీపై గత మూడేళ్లుగా ఎడతెగని పోరాటం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తుంటే.. అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.. మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు.


ఆ తర్వాత కూడా బన్నీ ఏదో ఒక విషయంలో పవన్‌ను టార్గెట్ చేయడం.. పవను గెలిచిన కనీసం వెళ్ళి శుభాకాంక్షలు చెప్పకపోవడం.. ఇటు పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో హీరోలు స్మగ్లర్ల పాత్రలు వేస్తున్నారు అని పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడటం.. ఇవన్నీ పవన్ వర్సెస్ బన్నీ అభిమానుల మధ్య గ్యాప్ బాగా పెంచేసాయి. నాగబాబు కూడా బన్నీతో పాటు.. బన్నీ అభిమానులను టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు.


కిర్రాక్ ఆర్పీ వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వచ్చే నెల 5న‌ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తాజాగా మెగా అభిమానులు పుష్ప 2పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని మాట్లాడుకుంటున్న ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీపిఎస్ ద్వారా సినిమాను లైవ్ స్ట్రిమింగ్ చేస్తానని.. అందులో సినిమా బాలేదని చెబుతానని.. ఓ అభిమాని చెప్పడం జరిగింది. విపిఎన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఐపీ అడ్రస్.. ఎవరన్నది దొరకటం కష్టమని చెప్పుకోవటం ఈ ఆడియో కాల్ రికార్డింగ్లో వినిపించింది.


దీనికి అల్లు అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీకు అంత దమ్ము ఉంటే ఆచార్య ఎందుకు హిట్ చేసుకోలేకపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా.. పుష్ప 2 సినిమాను అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ మెగా అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పుష్ప 2 ను మెగా అభిమానులు ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా వుందా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>