MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/cinema15a32b25-6239-46e6-a8a2-a3009005e9c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/cinema15a32b25-6239-46e6-a8a2-a3009005e9c8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా బచ్చలమల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అల్లరి నరేష్, ఈ మధ్య యాక్షన్ సినిమాలతో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే బచ్చలమల్లి సినిమా కూడా ఆ వరుసలోనే ఉన్నట్లు తెలుస్తోంది. CINEMA{#}amrutha;Allari;Sri Venkateswara swamy;Varsham;cinema theater;Music;Event;producer;Producer;Comedy;Mass;Naresh;allari naresh;Hero;December;Cinemaబచ్చలమల్లి టీజర్... అల్లరి కాదు నరేష్ కి మరో ట్యాగ్ ఇవ్వాల్సిందే..!బచ్చలమల్లి టీజర్... అల్లరి కాదు నరేష్ కి మరో ట్యాగ్ ఇవ్వాల్సిందే..!CINEMA{#}amrutha;Allari;Sri Venkateswara swamy;Varsham;cinema theater;Music;Event;producer;Producer;Comedy;Mass;Naresh;allari naresh;Hero;December;CinemaThu, 28 Nov 2024 19:52:00 GMTటాలీవుడ్ హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా బచ్చలమల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అల్లరి నరేష్, ఈ మధ్య యాక్షన్ సినిమాలతో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే బచ్చలమల్లి సినిమా కూడా ఆ వరుసలోనే ఉన్నట్లు తెలుస్తోంది.  
 డిసెంబర్ 20న థియేటర్ లో విడుదల కానున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ కి జోడీగా హనుమాన్ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తుంది. తాజాగా బచ్చలపల్లి మూవీ టీజర్ అప్డేట్ ను అమీర్ పేట్ లోని AAA సినిమాస్ లో చిత్ర బృందం రిలీజ్ చేసింది.
సినిమా పోస్టర్ లో అల్లరి నరేష్ సిగరెట్‌ తాగుతూ మాస్ లుక్ లో కనిపించాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా 'నేను ఎవ్వరి కోసం మారను. నాకు నచ్చినట్టు బతుకుతా' అనే డైలాగ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బచ్చలమల్లి మూవీ అల్లరి నరేష్ జీవితంలో బెస్ట్ సినిమా అవుతుందని, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, హిట్టు కొడుతున్నామని నిర్మాత రాకేష్ దండు అన్నారు. అయితే ఈవెంట్ కు హీరో అల్లరి నరేష్ ట్రాక్టర్ లో రావడం జరిగింది.  దీంతో ఈ సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులలో ఆసక్తితో పాటు ఈ సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బచ్చలమల్లి టీజర్ లో నరేష్ మాస్ లుక్ లో కనిపించడంతో ఇకపై అల్లరి కాదు నరేష్ కి మరో ట్యాగ్ ఇవ్వాల్సిందే అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంది సామీ ఇది...పుష్ప అన్ని గంటలు కూర్చోబెడతాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>