Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-2bd52ad5-af8f-4be2-85e5-46bc63d28848-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-2bd52ad5-af8f-4be2-85e5-46bc63d28848-415x250-IndiaHerald.jpg'లేడీ సూపర్ స్టార్' నయనతార తన కెరీర్‌లో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఇటీవలే అటువంటి కష్టాల గురించి తెలిపే 'నయనతార: బియాండ్ ది ఫేయిర్ టేల్' అనే డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీలోని ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నయనతార తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతి పెద్ద అవమానం గురించి చెప్పారు. 2005లో వచ్చిన ‘గజిని’ సినిమా షూటింగ్ సమయంలో తనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని నయనతార చెప్పారు. ఆ సినిమాలో సూర్య, అసిన్‌తో కలిసి నయనతార స్క్రీన్ షేర్ చNayantara {#}Cheque;nayantara;News;Darsakudu;Cinema;Directorఅప్పుడు నా బాడీని దారుణంగా ట్రోల్ చేశారు.. షాకింగ్ విషయం చెప్పిన నయనతార?అప్పుడు నా బాడీని దారుణంగా ట్రోల్ చేశారు.. షాకింగ్ విషయం చెప్పిన నయనతార?Nayantara {#}Cheque;nayantara;News;Darsakudu;Cinema;DirectorWed, 27 Nov 2024 18:01:00 GMT'లేడీ సూపర్ స్టార్' నయనతార తన కెరీర్‌లో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఇటీవలే అటువంటి కష్టాల గురించి తెలిపే 'నయనతార: బియాండ్ ది ఫేయిర్ టేల్' అనే డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీలోని ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నయనతార తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతి పెద్ద అవమానం గురించి చెప్పారు. 2005లో వచ్చిన ‘గజిని’ సినిమా షూటింగ్ సమయంలో తనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని నయనతార చెప్పారు. ఆ సినిమాలో సూర్య, అసిన్‌తో కలిసి నయనతార స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో తన శరీర బరువు గురించి చాలా విమర్శలు వచ్చాయని, తనను ‘ఓవర్‌వెయిట్’ అని అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయని ఆమె బాధపడ్డారు.

“‘గజిని’ సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నా శరీరం గురించి అనవసరమైన విమర్శలు చేశారు. నేను ఎందుకు ఈ సినిమాలో నటిస్తున్నానని ప్రశ్నించారు. నా నటన గురించి కాకుండా, నా రూపం గురించే ఎక్కువగా మాట్లాడారు. నా బాడీని దారుణంగా ట్రోల్ చేశారు. ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలు చేయడం సరికాదు.” అని నయనతార తన డాక్యుమెంటరీలో బాధగా చెప్పారు. తన నటన గురించి సలహాలు ఇస్తే తనకు సంతోషంగా ఉంటుందని, కానీ తన శరీరం గురించి అనవసరమైన విమర్శలు చేయడం బాధ కలిగిస్తుందని ఆమె అన్నారు.

సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తనకు ఏ పాత్ర ఇస్తే అది చేయడమే తప్ప, తనకు మరో మార్గం లేదని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చారు. "దర్శకుడు నన్ను ఏం చేయమంటే అదే చేసేదాన్ని, ఏం వేయమంటే అదే వేసేదాన్ని" అని ఆమె తెలిపారు. 2007లో విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన 'బిల్లా' సినిమాలో బికిని వేసినందుకు తనపై వచ్చిన విమర్శల గురించి కూడా నయనతార మాట్లాడారు. "ఆ సీన్ కథకు అవసరం కాబట్టి దర్శకుడు చెప్పినట్లు చేశాను. అది నా నిర్ణయం కాదు. కానీ ఆ సీన్ సినిమాకు బాగా కలిసి వచ్చిందని బాడీ షేమింగ్ కామెంట్స్ కి చెక్ పెట్టినట్లు అయిందని నేను భావిస్తున్నాను." అని ఆమె వివరించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ కళ్యాణ్ ను కంట్రోల్ చేసే ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>