Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkys-2640e1f9-c103-46ab-a22d-b6fa1f0ad8fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkys-2640e1f9-c103-46ab-a22d-b6fa1f0ad8fc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటుడు, ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్, విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల అతని సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు వెంకటేష్. నిర్మాత రామానాయుడు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అరంగేట్రం చేసినప్పటికీ, తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముఖ్యంగా తెలుగు మహిళ జనానికి బాగా చేరువయ్యారు విక్టరీ వెంకటేష్. ఇక అతను సినిమాలను ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు అలరిస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. Venkys {#}Venkatesh;Makar Sakranti;F2;producer;Producer;Pokiri;Audience;Telugu;Cinemaఅప్పుడు బ్లాక్ బస్టర్.. వెంకీ మామకు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా?అప్పుడు బ్లాక్ బస్టర్.. వెంకీ మామకు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా?Venkys {#}Venkatesh;Makar Sakranti;F2;producer;Producer;Pokiri;Audience;Telugu;CinemaTue, 26 Nov 2024 16:30:00 GMTటాలీవుడ్ నటుడు, ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్, విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల అతని సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు వెంకటేష్. నిర్మాత రామానాయుడు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అరంగేట్రం చేసినప్పటికీ, తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముఖ్యంగా తెలుగు మహిళ జనానికి బాగా చేరువయ్యారు విక్టరీ వెంకటేష్. ఇక అతను సినిమాలను ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు అలరిస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక అసలు విషయంలోకి వెళితే, వెంకటేష్ సినిమాలు ఎక్కువగా సంక్రాంతి బరిలో నిలుస్తాయి అని చెప్పుకోవచ్చు. మన తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎంత ముఖ్యమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. దాంతోనే సినిమా మేకర్ సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోవాలని సినిమాలను రంగంలోకి దించుతూ ఉంటారు. అందులో ప్రతి ఏటా దాదాపుగా విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా ఒకటి ఉంటుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఈ సినిమా పైన హైప్ పెంచాయి. ఇప్పుడు వరకు దాదాపు విక్టరీ వెంకటేష్ 17 సార్లు సంక్రాంతి పండుగకు తన సినిమాలను రిలీజ్ అయ్యేటట్టు చేసుకున్నట్టు తెలుస్తుంది.

అందులో చాలా వరకు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. రక్త తిలకం, ప్రేమ, చంటి, పోకిరి రాజా, ధర్మచక్రం, చిన్నబ్బాయి, కలిసుందాం రా, దేవి పుత్రుడు, నమో వెంకటేశ, లక్ష్మి, బాడీగార్డ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాలను ఎన్నిటినో ఆయన మనకు అందించారు. అయితే ఈసారి రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎటువంటి ఫలితం రాబడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు పడుతుంది!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>