MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr392b518a-8c61-4200-8ec7-110995a9c4c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr392b518a-8c61-4200-8ec7-110995a9c4c6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ కి సరిసాటి ఎవరూ లేరనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ లో జోష్ కానీ, ఫైట్స్ లో స్పీడ్ కానీ ఈయన లాగా ఎవరు చేయలేరు అనడంలో సందేహంNTR{#}Japan;Komaram Bheem;RRR Movie;Hindi;Blockbuster hit;Josh;Fidaa;Audience;war;NTR;Tamil;Rajamouli;Hero;Yevaru;Manam;CinemaJr. NTR: వామ్మో, తారక్ ఇన్ని భాషలు మాట్లాడతారా.. నిజంగా గ్రేట్ కదా..!Jr. NTR: వామ్మో, తారక్ ఇన్ని భాషలు మాట్లాడతారా.. నిజంగా గ్రేట్ కదా..!NTR{#}Japan;Komaram Bheem;RRR Movie;Hindi;Blockbuster hit;Josh;Fidaa;Audience;war;NTR;Tamil;Rajamouli;Hero;Yevaru;Manam;CinemaTue, 26 Nov 2024 16:36:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ కి సరిసాటి ఎవరూ లేరనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ లో జోష్ కానీ, ఫైట్స్ లో స్పీడ్ కానీ ఈయన లాగా ఎవరు చేయలేరు అనడంలో సందేహం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇకపోతే రీసెంట్ గా దేవర  సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో వార్ -2 లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా హీరోలు ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడడం మనం చూస్తాం. ఒకవేళ పక్క రాష్ట్రానికి వెళ్తే. తమ సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు కూడా మాక్సిమం ఇంగ్లీషులోనే మాట్లాడుతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ భాష ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ ఆ భాష మాట్లాడి ఆడియన్స్ ను మెప్పిస్తారు. ముఖ్యంగా ఈయన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు అనర్గళంగా హిందీ మాట్లాడి ఎలా ప్రేక్షకులను అలరించారో అందరికీ తెలిసిందే.

ఒక హిందీ మాత్రమే కాదు కన్నడ, తమిళ్ భాషలను కూడా ఈయన అవలీలగా మాట్లాడేస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడి, అక్కడివారిని అబ్బురపరిచిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడడం చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ టాలెంట్ కి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>