MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-21e45c9b2-f9e5-4236-8169-5ebc734bfef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-21e45c9b2-f9e5-4236-8169-5ebc734bfef6-415x250-IndiaHerald.jpgరిలీజ్‌కు టైం దగ్గర పడుతుంది. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా భారతీయ సినిమా ప్రేమికులతో పాటు.. కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఏ దేశంలో ఉన్నా కూడా పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఒక్కటే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానుంది. డిసెంబర్ 4న అమెరికాలోను.. ఇటు ఇండియాలోనూ ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు వేస్తున్నారు. Pushpa 2{#}Coffee;Traffic police;Indians;Hyderabad;Press;Allu Arjun;rashmika mandanna;devi sri prasad;Event;November;December;Director;Cinema;war;monday' పుష్ప 2 ' కు గుమ్మ‌డికాయ కొట్టేసినా.. ఇంకా మైత్రీ మూవీస్‌కు బిగ్‌ టెన్ష‌న్‌... !' పుష్ప 2 ' కు గుమ్మ‌డికాయ కొట్టేసినా.. ఇంకా మైత్రీ మూవీస్‌కు బిగ్‌ టెన్ష‌న్‌... !Pushpa 2{#}Coffee;Traffic police;Indians;Hyderabad;Press;Allu Arjun;rashmika mandanna;devi sri prasad;Event;November;December;Director;Cinema;war;mondayTue, 26 Nov 2024 10:22:00 GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప 2 సినిమా.. రిలీజ్‌కు టైం దగ్గర పడుతుంది. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా భారతీయ సినిమా ప్రేమికులతో పాటు.. కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఏ దేశంలో ఉన్నా కూడా పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఒక్కటే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానుంది. డిసెంబర్ 4న అమెరికాలోను.. ఇటు ఇండియాలోనూ ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు వేస్తున్నారు.


అయితే నవంబర్ 20 నాటికి తొలి కాపీ సిద్ధమై పోవాలన్నది నిర్మాతల టార్గెట్. అది సాధ్యం కాలేదు. ఇప్పటికే ఆర్ఆర్ బాగా లేట్ అయిందని పుష్ప 2 నిర్మాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ వర్సెస్.. పుష్ప నిర్మాతల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా పుష్ప 2 ప్యాచ్ వర్క్ నడిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో.. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సన్నివేశాలను తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా షూటింగ్ ఉండవచ్చని తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆర్ఆర్ ఇప్పటికే పూర్తయింది. సెకండాఫ్ వర్క్ కూడా వేగంగా నడుస్తోంది. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ చేతుల్లో ఉంటుందని అంటున్నారు.


మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే వేగం అయ్యాయి. ఇప్పటికే పాట్నాలో ఓ మెగా ఈవెంట్‌ నిర్వహించి.. చెన్నైలో కిసిక్ పాట విడుదల చేశారు. ఈనెల 27న కొచ్చేలో ఓ ఈవెంట్ ఉంది. ఆ తర్వాత హైదరాబాదులో భారీ వేడుక ఉంటుంది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ ఈవెంట్ తర్వాత.. బెంగళూరులో మరో ప్రమోషన్ కార్యక్రమం.. ఆ తర్వాత ముంబైలో ప్రెస్ మీట్ ఉంటుందని తెలుస్తోంది. బన్నీ ఈసారి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తాడా.. లేదా.. అనే సందేహం ఉంది. కామన్ ఇంటర్వ్యూలు చేసి మీడియాకు ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఇంత వేగంగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్లానింగ్ ఉన్నా కూడా.. ఇప్పటికీ ఫస్ట్ కాఫీ చేతిలోకి రాకపోవడంతో మైత్రి మూవీస్ వాళ్లకు ఇంకా టెన్షన్ టెన్షన్ గానే వాతావరణం ఉన్నట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ తల్లికి కోపం తెప్పించిన స్టార్ హీరోయిన్..కాల్ చేసి అడిగి కడిగి పడేసిందిగా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>