MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-link-to-politics-with-natarathna-ntr-and-chiranjeevi-s-movie25bbc5b2-93a7-4007-947c-b3f168c8f98f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-link-to-politics-with-natarathna-ntr-and-chiranjeevi-s-movie25bbc5b2-93a7-4007-947c-b3f168c8f98f-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఈ రెండు కుటుంబాల నుంచి ఎంతో మంది హీరోలు చిత్ర పరిశ్రమలు అడుగు పెట్టి అగ్ర హీరోలు గా దూసుకుపోతున్నారు . అలాగే ఈ కుటుంబాల హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతూ వస్తున్నాయి . ఇలా సినిమాల పరంగా ఈ రెండు కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా గట్టి పోటీ నడుస్తూనే ఉంది . ముఖ్యంగా చిరంజీవి - బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయంటే ఈ రెండు కుటుంబాల అభిమానుల సంబరాలు మామూలుగా ఉండవు. Chiranjeevi {#}Film Industry;NTR;Balakrishna;Jr NTR;Industries;Box office;Ram Charan Teja;Chiranjeevi;Audience;Cinema;marriageనటరత్న ఎన్టీఆర్ తో చిరంజీవి నటించిన ఆ సినిమాకు .. రాజకీయాలకు ఉన్న లింక్ ఇదే..!నటరత్న ఎన్టీఆర్ తో చిరంజీవి నటించిన ఆ సినిమాకు .. రాజకీయాలకు ఉన్న లింక్ ఇదే..!Chiranjeevi {#}Film Industry;NTR;Balakrishna;Jr NTR;Industries;Box office;Ram Charan Teja;Chiranjeevi;Audience;Cinema;marriageTue, 26 Nov 2024 12:06:44 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లో నందమూరి కుటుంబం మరియు మెగా కుటుంబం ఈ చిత్ర పరిశ్రమ లోనే అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాలు గా కొనసాగుతున్నాయి .. ఇప్పటికే ఈ రెండు కుటుంబాల నుంచి ఎంతో మంది హీరోలు చిత్ర పరిశ్రమలు అడుగు పెట్టి అగ్ర హీరోలు గా దూసుకుపోతున్నారు . అలాగే ఈ కుటుంబాల హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతూ వస్తున్నాయి . ఇలా సినిమాల పరంగా ఈ రెండు కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా గట్టి పోటీ నడుస్తూనే ఉంది . ముఖ్యంగా చిరంజీవి - బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయంటే ఈ రెండు కుటుంబాల అభిమానుల సంబరాలు మామూలుగా ఉండవు.


అలాగే ఈ రెండు కుటుంబాల్లో అగ్ర హీరోలుగా కోన‌సాగుతున్న రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాలో కలిసి నటించారు . అయితే ఈ రెండు కుటుంబాల కలయికలో గతంలో మరో సినిమా బాక్సాఫీస్ ముందుకు వచ్చింది . నటరత్న ఎన్టీఆర్ , మెగాస్టార్ చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి అనే సినిమాలో నటించారు . ఈ సినిమాని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగా రెండు సంవత్సరాల ముందు చేశారు . 1981 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .


ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్ గా కనిపిస్తే , చిరంజీవి క్లబ్ డాన్సర్ గా కనిపించాడు . అదేవిధంగా ఈ సినిమాలో చిరంజీవి ని ఎన్టీఆర్ చెల్లి పెళ్లి చేసుకోగా మళ్లీ నెగటివ్ రోల్ లో కూడా కనిపించాడు చిరు . ఈ సినిమా క్లైమాక్స్ వరకు చిరంజీవి విలన్ గా కనిపించి చివరలో మెయిన్ విలన్ల ఆట కట్టించేందుకు ఎన్టీఆర్ తో కలిసి ఫైట్ చేసి ఆడియన్స్ ను మెప్పించాడు.  కె. రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు . ఇలా ఎన్టీఆర్ రాజకీయాల్లో కి వచ్చే రెండు సంవత్సరాల ముందు చిరంజీవి తో నటించి అరుదైన రికార్డును అందుకున్నాడు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రేకప్ నిజమే.. జీవితంలో పెళ్లి చేసుకోను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>