MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-ntrbba558e5-38a2-40be-8c86-8bb0454edb7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-ntrbba558e5-38a2-40be-8c86-8bb0454edb7d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ చరిత్రలో రాముడు పేరుతో దాదాపు 30 సినిమాలు వచ్చాయని అంటారు. వీటిలో మెజార్టీ సినిమాలలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. దొంగ రాముడు , డ్రైవర్ రాముడు , అడవి రాముడు, టైగర్ రాముడు, రాముడు - భీముడు ఇలా అనేక సినిమాలలో ఆయన నటించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం అందాల రాముడు సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ నటించిన అన్ని రాముడు సినిమాలో కూడా మెజార్టీ హిట్ అయ్యాయి. senior ntr{#}ramu;Driver;Thief;Donga;Akkineni Nageswara Rao;krishna;NTR;Balakrishna;Tollywood;Industry;Telugu;Cinema;Indiaఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌పై అక్కినేని సెటైర్లు.. చివ‌ర‌కు ఎన్టీఆర్ ఏం చేశారంటే..?ఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌పై అక్కినేని సెటైర్లు.. చివ‌ర‌కు ఎన్టీఆర్ ఏం చేశారంటే..?senior ntr{#}ramu;Driver;Thief;Donga;Akkineni Nageswara Rao;krishna;NTR;Balakrishna;Tollywood;Industry;Telugu;Cinema;IndiaTue, 26 Nov 2024 12:29:45 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

తెలుగు సినిమా రంగంలో రాముడు పేరుతో అనేక సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో రాముడు పేరుతో దాదాపు 30 సినిమాలు వచ్చాయని అంటారు. వీటిలో మెజార్టీ సినిమాలలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. దొంగ రాముడు , డ్రైవర్ రాముడు , అడవి రాముడు, టైగర్ రాముడు, రాముడు - భీముడు ఇలా అనేక సినిమాలలో ఆయన నటించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం అందాల రాముడు సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ నటించిన అన్ని రాముడు సినిమాలో కూడా మెజార్టీ హిట్ అయ్యాయి.


అయితే ఎన్ని సినిమాలుకు రాము తగిలించడాన్ని అయితే నాగేశ్వరరావు పెద్దగా ఇష్టపడలేదు. అందుకే తన సినిమాల్లో ఒకటి రెండు రాముడు ఉండేలానే ఆయన ఇష్టపడ్డారు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం చాలా సినిమాలకు రాముడు పేరును తగిలించుకున్నారు. ఇలా ఎన్టీఆర్ చాలా సినిమాలకు రాముడు పేరు పెట్టుకోవడంపై అక్కినేని ఒకానొక సందర్భంలో సెటైర్లు వేశారు. ఇన్ని రాములు ఉండరు మాస్టారు.. ఒక్కడే రాముడు. కావాలంటే కృష్ణుడిని తగిలించుకోండి అని చమత్కరించారు అట.


ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు ఇదే తరహాలో వచ్చాయి. కానీ.. రాముడి ట్యాగ్‌కు ఉన్నంత ఆదరణ కృష్ణ ట్యాగ్‌కు లభించలేదు. అంతేకాదు కృష్ణుడి ట్యాగ్ పెట్టుకుని చేసిన సినిమాలు పెద్దగా లాభాలు కూడా తీసుకురాలేదట. దీంతో మళ్లీ రాముడు బాటలోనే ఇండస్ట్రీ ఎక్కువగా నడిచింది. అయితే అక్కినేని ఇచ్చిన సూచనలతో ఆ తర్వాత ఎన్టీఆర్ రాముడు చాలావరకు తగ్గించుకున్నారు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత కూడా ఏఎన్నార్ కుమారుడు రాముడు వచ్చాడు లాంటి టైటిల్స్‌తో సినిమాలు చేశారు. అలాగే ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య కూడా రాము పేరుతో సినిమాలు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రేకప్ నిజమే.. జీవితంలో పెళ్లి చేసుకోను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>