MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akkhineni-akhil-engagement-zainab-ravdjee-nagarjuna731b0ece-2c96-4308-b90d-064abdc1ce6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akkhineni-akhil-engagement-zainab-ravdjee-nagarjuna731b0ece-2c96-4308-b90d-064abdc1ce6a-415x250-IndiaHerald.jpgఅక్కినేని అభిమానులకి ఈ మధ్యకాలంలో వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఈ ఏడాదిలో అక్కినేని ఫ్యాన్స్ శోభిత నాగచైతన్య ల ఎంగేజ్మెంట్,పెళ్లి వార్తలతో చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ ఇయర్ ఎండింగ్లో నాగార్జున మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కి కూడా ఎంగేజ్మెంట్ చేసి త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేయడానికి సిద్ధం అయిపోతున్నట్టు తెలుస్తోంది.అయితే కొడుకు ఎంగేజ్మెంట్ రహస్యంగా చేయడానికి ఓ కారణం ఉందట. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. అక్కినేని అఖిల్ మొదట శ్రియా భూపాల్ ని ప్రేమించిAKKHINENI AKHIL ENGAGEMENT; ZAINAB RAVDJEE; NAGARJUNA{#}shobitha;Good Newwz;Akkineni Nagarjuna;media;Good news;akhil akkineni;marriageరహస్యంగా అఖిల్ ఎంగేజ్మెంట్.. నాగార్జున పెద్ద ప్లానే వేసాడుగా.?రహస్యంగా అఖిల్ ఎంగేజ్మెంట్.. నాగార్జున పెద్ద ప్లానే వేసాడుగా.?AKKHINENI AKHIL ENGAGEMENT; ZAINAB RAVDJEE; NAGARJUNA{#}shobitha;Good Newwz;Akkineni Nagarjuna;media;Good news;akhil akkineni;marriageTue, 26 Nov 2024 17:58:00 GMT అక్కినేని అభిమానులకి ఈ మధ్యకాలంలో వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఈ ఏడాదిలో అక్కినేని ఫ్యాన్స్ శోభిత నాగచైతన్య ల ఎంగేజ్మెంట్,పెళ్లి వార్తలతో చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ ఇయర్ ఎండింగ్లో నాగార్జున మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కి కూడా ఎంగేజ్మెంట్ చేసి త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేయడానికి సిద్ధం అయిపోతున్నట్టు తెలుస్తోంది.అయితే కొడుకు ఎంగేజ్మెంట్ రహస్యంగా చేయడానికి ఓ కారణం ఉందట. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. అక్కినేని అఖిల్ మొదట శ్రియా భూపాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో చెప్పనక్కర్లేదు.పెళ్లి ఎలా అయితే చేస్తారో అంత గ్రాండ్ గా చేసారు ఎంగేజ్మెంట్.కానీ పెళ్లికి కొద్ది రోజులు ఉంది అనగా ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చి విడిపోయారు. 

దాంతో చాలా రోజులు ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.అయితే తాజాగా అక్కినేని అఖిల్ జైనాబ్ రవ్ డ్జి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్టు తెలుస్తోంది.అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న విషయం ఎంగేజ్మెంట్ జరిగే వరకు కూడా ఎవరికి తెలియదు.అంత రహస్యంగా చేశారు.ఇక ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని కూడా అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులందరికీ తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ అందరు తెగ సంబరపడిపోతున్నారు. అయితే నాగార్జున తన కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ ని రహస్యంగా చేయడానికి ఒక కారణం ఉందట.

అదేంటంటే.. మొదట ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో అఖిల్,శ్రియా భూపాల్ తో పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే బ్రేకప్ అయింది .కానీ ఈ పెళ్లి సంబంధం అలా కాకూడదనే ఉద్దేశంతో అక్కినేని అఖిల్ జాతకం చూపించి మరీ ఆయన జాతకంలో ఉన్న దోషానికి దోష నివారణ పూజలు చేయించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎంగేజ్మెంట్ ని కానిచ్చేశారట. అలా ఇద్దరి కొడుకుల వైవాహిక జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో దేవుళ్లను అంతగా నమ్మని నాగార్జున ఎన్నో పూజలు, యాగాలు కూడా చేసినట్టు ఇండస్ట్రీలో ఓ వార్త వినిపిస్తోంది. మరి అఖిల్ పెళ్లి కూడా ఈ ఏడాది చేస్తారా లేక వచ్చే ఏడాది చేస్తారా..అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ ఇద్దరు కొడుకుల పెళ్లిని ఒకేసారి చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>