MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/arrahamanfb931480-75ab-482c-bf83-49f26f823ee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/arrahamanfb931480-75ab-482c-bf83-49f26f823ee5-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా ఉండిపోతుంది. అలాంటిది ఎన్నో ఏళ్లు కలిసున్న సెలబ్రిటీలు సడెన్‌గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే దానిపై ఎన్నో రోజులు చర్చలు సాగుతూనే ఉంటాయి.తాజాగా ఆస్కార్ విజేత, వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బాను విడిపోతున్నట్టుగా, విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏఆర్ రెహమాన్ చేసిన ప్రకటన ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన విడాకులు తీసుARrahaman{#}sye-raa-narasimha-reddy;mohini;Saira Narasimhareddy;Oscar;Sangeetha;Husband;media;Chennai;Mumbai;Wife;Director;prema;Love;marriage;Newsపెళ్ళై ముప్పై ఏళ్ళు పూర్తి అనుకునేలోపే...అంటూ షాకిచ్చిన ఏఆర్ రహమాన్.!పెళ్ళై ముప్పై ఏళ్ళు పూర్తి అనుకునేలోపే...అంటూ షాకిచ్చిన ఏఆర్ రహమాన్.!ARrahaman{#}sye-raa-narasimha-reddy;mohini;Saira Narasimhareddy;Oscar;Sangeetha;Husband;media;Chennai;Mumbai;Wife;Director;prema;Love;marriage;NewsMon, 25 Nov 2024 08:34:00 GMTసినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా ఉండిపోతుంది. అలాంటిది ఎన్నో ఏళ్లు కలిసున్న సెలబ్రిటీలు సడెన్‌గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే దానిపై ఎన్నో రోజులు చర్చలు సాగుతూనే ఉంటాయి.తాజాగా ఆస్కార్ విజేత, వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బాను  విడిపోతున్నట్టుగా, విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏఆర్ రెహమాన్ చేసిన ప్రకటన ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన విడాకులు తీసుకోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలావుండగా ఏఆర్ రెహమాన్ 1995లో సైరా బాను పెళ్లి చేసుకున్నారు.వీరి వివాహ బంధానికి 29ఏళ్లు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఖతీజా, రహీమా, అమీన్. ఈ క్రమంలో తన 29 ఏండ్ల మార్యేజ్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ..ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను కు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని దంపతుల తరఫున వారి లాయర్ వందనా అధికారికంగా ప్రకటించారు.ఈ సమయంలో వారి లాయర్ వందన షా మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల వివాహ బంధాన్ని ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఏఆర్ రెహమాన్, సైరా భాను విడాకులు తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేకపూరిత ఒత్తిడి నెలకొంది. అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారికి ఒకరిపై ఒక మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల కారణంగా వారు దూరం అవుతున్నారని లాయర్ వందనా షా పేర్కొన్నారు.

విడాకులపై ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. మా వివాహ బంధం త్వరలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఆనందించాను. కానీ, అనుకోకుండా వివాహ బంధానికి ఇలా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుని కూడా ప్రభావితం చేస్తాయి. పలికిన ముక్కలు మళ్ళీ అతుక్కోలేవు. అందుకే మా దారులు వేరు అని తెలుసుకొని.. విడిపోతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటూ ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు.ఈ క్రమంలోనే రెహమాన్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. తన శిష్యురాలపై మనసు పారేసుకుని రెహమాన్ తన భార్యకు విడాకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.అయితే రెహమాన్ - సైరా బానులు విడాకులు ప్రకటించిన రోజునే ఆయన శిష్యురాలు, బాసిస్ట్ మోహిని డే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో పలు వార్తలు గుప్పుమన్నాయి. రెహమాన్ కు మోహినికి రిలేషన్ కలుపుతూ ఇష్టానుసారంగా రూమర్స్ క్రియేట్ చేశారు.

ఇదిలావుంటే ప్రస్తుతం విడాకులపై ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను స్పందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. ఏఆర్ రెహామాన్ ప్రతిష్టను దిగజార్చవద్దని అభ్యర్థించారు. రెహమాన్ ,అతని కుటుంబాన్ని బాధపెట్టకుండా ఉండమని యూట్యూబర్‌లు, మీడియాను అభ్యర్థించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.సైరా బాను తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడింది. ప్రస్తుతం తాను ముంబయిలో ఉంటున్నాననీ, గత కొన్ని నెలలుగా తన ఆరోగ్యం బాలేదనీ, ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నానని తెలిపారు.యూట్యూబర్స్, మీడియా వారిని కోరుకునే ఒక్కటేననీ, రెహామన్ పై ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దని కోరుకున్నారు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. తాను రీట్‌మెంట్‌ కోసం ముంబయి వచ్చాననీ, రెహమాన్ అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఆయనకు కూడా తానంటే ఇష్టమన్నారు. ఇకపై నుంచి రెహమాన్ పై విమర్శలు చేయడం ఆపండని కోరుకున్నరు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించవద్దనీ, తాను త్వరలోనే చెన్నై వస్తానని సైరా బాను పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ వీర‌మ‌ళ్లుకు ఊహించని షాక్ .. ఆందోళనలో ఫాన్స్ కారణం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>