MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb4098971-44bf-4018-b65a-b3b3ecb52b60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb4098971-44bf-4018-b65a-b3b3ecb52b60-415x250-IndiaHerald.jpgఎప్పుడో మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాపై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. అసలే టాలీవుడ్ కరోనా కష్టకాలం నుంచి బయటకు వచ్చిన వేళ.. బాలయ్య అఖండ సినిమా థిఆయేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా.. రారా.. అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ వెంటనే బన్నీ.. పుష్ప సినిమాతో రెండు వారాలు త‌ర్వాత‌ థియేటర్లలోకి దిగాడు. allu arjun{#}rashmika mandanna;Balakrishna;Naga Chaitanya;Tollywood;Andhra Pradesh;sree;sukumar;Director;Cinema;Audience;Samantha;Allu Arjun' పుష్ప 2 ' నైజాం ఆల్ టైం రికార్డ్‌... టాలీవుడ్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం ...!' పుష్ప 2 ' నైజాం ఆల్ టైం రికార్డ్‌... టాలీవుడ్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం ...!allu arjun{#}rashmika mandanna;Balakrishna;Naga Chaitanya;Tollywood;Andhra Pradesh;sree;sukumar;Director;Cinema;Audience;Samantha;Allu ArjunMon, 25 Nov 2024 08:18:00 GMTఎప్పుడో మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాపై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. అసలే టాలీవుడ్ కరోనా కష్టకాలం నుంచి బయటకు వచ్చిన వేళ.. బాలయ్య అఖండ సినిమా థిఆయేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా.. రారా.. అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ వెంటనే బన్నీ.. పుష్ప సినిమాతో రెండు వారాలు త‌ర్వాత‌ థియేటర్లలోకి దిగాడు.


పుష్ప సినిమా జనాలకు ఎక్కేసింది. తగ్గేదెలా అంటూ బన్నీ గడ్డాన్ని టచ్ చేస్తూ చెప్పే డైలాగ్, ఆ సరికొత్త మేన‌రిజం, రష్మిక అందాలు, ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామ అంటూ సమంత చందాలు ఆరబోయటం.. పైగా సమంత, నాగచైతన్య విడాకులు తర్వాత సమంత రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ బన్నీ పక్కన ఐటమ్ సాంగ్ నటించడం.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు, నేపథ్య‌ సంగీతం, మాస్‌ను మెప్పించే కథ‌, కథనాలు.. సుకుమార్ స్టైల్, టేకింగ్ ఇవన్నీ స్లో పాయిజ‌న్‌లా జనాలకు ఎక్కేసాయి.
 

నార్త్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా పుష్ప.. ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత వస్తున్న పుష్ప సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది సంచలన రికార్డు. ఇదిలా ఉంటే.. పుష్ప 2 బిజినెస్‌కు హద్దులు కనిపించడం లేదు. రిలీజ్ ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్‌లో మామూలుగా బిజినెస్ అంటే ఆంధ్రాలో ఎక్కువ జరుగుతుంది.


సెకండ్ ప్లేస్ లో నైజాం, ఆ తర్వాత సిడెడ్ అన్నట్టు ఉంటుంది. కానీ.. ఇప్పుడు నైజాం ఫస్ట్ ప్లేస్ లోకి.. ఏపీ సెకండ్ ప్లేస్లోకి చేరింది. ఆంధ్ర బిజినెస్ రూ.85 నుంచి రూ.90 కోట్లకు అమ్మారు. కానీ.. నైజాం బిజినెస్ రూ.100 కోట్ల మేరకు క్లోజ్ చేశారు. ఇది మామూలు సంచలనం కాదు. మొత్తానికి నైజం.. పుష్ప 2 ఓవ‌రాల్‌గా రూ.210 కోట్లు వసూలు చేస్తే.. ఖర్చులు పన్నులతో కలిపి గిట్టుబాటు అవుతుంది. ఇది మామూలు రికార్డు కాదు. టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా బన్నీ పేరిట నిలిచిపోనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ వీర‌మ‌ళ్లుకు ఊహించని షాక్ .. ఆందోళనలో ఫాన్స్ కారణం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>