MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prashant-varma85562030-f336-4e67-b975-f235b2d36e8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prashant-varma85562030-f336-4e67-b975-f235b2d36e8a-415x250-IndiaHerald.jpgహనుమాన్ 2 కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ వర్మ రచించిన కథలతో కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా తాజాగా రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ సినిమాకు ప్రశాంత్ వర్మ నే కథ‌ అందించారు. ప్రశాంత్ వర్మ కథ ఇవ్వటం వల్ల ఈ సినిమాకు రిలీజ్ ముందే మంచి మైలేజ్ వచ్చింది. ప్రశాంత్ వర్మ కచ్చితంగా ఏదో అద్భుతం చేస్తాడని అందరూ ఆశించారు. ప్రశాంత్ వర్మ స్టైల్లోనే సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ మిక్స్ అయPrashant Varma{#}Balakrishna;prasanth;Prashant Kishor;Tollywood;prasanth varma;Yuva;Darsakudu;Ram Gopal Varma;Director;India;Cinema;Fridayదారుణం: ఇంత రొట్ట రొడ్డ కొట్టుడు క‌థ‌కు ప్ర‌శాంత్ వ‌ర్మ రు. 2 కోట్లు తీసుకున్నాడా... !దారుణం: ఇంత రొట్ట రొడ్డ కొట్టుడు క‌థ‌కు ప్ర‌శాంత్ వ‌ర్మ రు. 2 కోట్లు తీసుకున్నాడా... !Prashant Varma{#}Balakrishna;prasanth;Prashant Kishor;Tollywood;prasanth varma;Yuva;Darsakudu;Ram Gopal Varma;Director;India;Cinema;FridaySun, 24 Nov 2024 11:13:17 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లో ఇప్పుడు యువ దర్శకుడు ప్రశాంత వర్మ పేరు మారుమోగుతోంది. హనుమాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినీ యూనివర్సిల్ పేరుతో చాలా సినిమాలు రూపు దిద్దుకుంటున్నాయి. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చివరి దశలో ఉంది. హనుమాన్ 2 కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ వర్మ రచించిన కథలతో కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా తాజాగా రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ సినిమాకు ప్రశాంత్ వర్మ నే కథ‌ అందించారు. ప్రశాంత్ వర్మ కథ ఇవ్వటం వల్ల ఈ సినిమాకు రిలీజ్ ముందే మంచి మైలేజ్ వచ్చింది. ప్రశాంత్ వర్మ కచ్చితంగా ఏదో అద్భుతం చేస్తాడని అందరూ ఆశించారు. ప్రశాంత్ వర్మ స్టైల్లోనే సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి.


సినిమా కోసం ప్రశాంత్ వ‌ర్మ‌ ఏకంగా రెండు కోట్లు తీసుకున్నాడని టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో గుసగుసలు ఉన్నాయి. ఓ కథ కు రెండు కోట్లు అంటే చాలా పెద్ద మొత్త‌మే. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు రాబట్టింది. దీంతో ప్రశాంతవర్మ క్రేజ్ ఉన్న‌ దర్శకుడు కాబట్టి అడిగినంత ఇచ్చి ఉండవచ్చు. కానీ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా చూస్తే అసలు ఈ కథ కు రెండు కోట్లు ఇవ్వడం అవసరమా ? అనిపిస్తుంది. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. లాజిక్ లు జోలికి అసలు వెళ్ళకపోవడమే మంచిది.


ఏం చూసి ఈ కథకు రెండు కోట్లు ఇచ్చారో నిర్మాతలకే తెలియాలి .. ప్రశాంత్ వర్మ కథ కాబట్టి సినిమాకు అంతా ఎంతో మైలేజ్ వస్తుంది. సినిమాకు మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు .. అని అడిగినంత ఇచ్చి ఉండవచ్చు ఓ పేరుని బ్రాండింగ్ మ్యూజిక్‌ మార్చేస్తే వచ్చే ప్రతిఫలం ఇది. ఇటీవల ఓటీటీలో మిస్టరీ ఆఫ్ మోక్షెస్ అనే వెబ్ సిరీస్ కి వచ్చింది. ఈ సిరీస్ కు ప్రశాంత్ వర్మనే కథ‌కుడు. ఓటీటీ లో ఈ సీరిస్ కు ఎలాంటి ఆదరణ రాలేదు. ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ‌లు అన్నీ తానే డైరెక్ట్ చేయలేడు. ఇలా కథ‌లని అమ్ముకుంటే ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కాకపోతే తన కథలు ప్లాప్ అయితే ఆ ప్రభావం ప్రశాంత్ వర్మ ఇమేజ్ పై పడుతుంది. ఈ విషయాన్ని మనోడు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ కు విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>