MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sukumar0d1eb803-33fc-4a6a-8dcd-afbd67ba51f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sukumar0d1eb803-33fc-4a6a-8dcd-afbd67ba51f8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కాంబినేషన్లో అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్లో మొదటగా ఆర్య అనే మూవీ వచ్చింది. అల్లు అర్జున్ కి హీరోగా ఈ సినిమా తన కెరీయర్లో రెండవ మూవీ కాగా , సుకుమార్ ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో ఆర్య 2 అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను ఈ మూవSukumar{#}arya;Arya 2;Aryaa;sukumar;Allu Arjun;Success;December;Cinemaసుకుమార్ కి డెడ్ లైన్.. అప్పటికి క్లోజ్ కాకుంటే పరిస్థితి ఏంటి..?సుకుమార్ కి డెడ్ లైన్.. అప్పటికి క్లోజ్ కాకుంటే పరిస్థితి ఏంటి..?Sukumar{#}arya;Arya 2;Aryaa;sukumar;Allu Arjun;Success;December;CinemaSun, 24 Nov 2024 15:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కాంబినేషన్లో అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్లో మొదటగా ఆర్య అనే మూవీ వచ్చింది. అల్లు అర్జున్ కి హీరోగా ఈ సినిమా తన కెరీయర్లో రెండవ మూవీ కాగా , సుకుమార్ ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో ఆర్య 2 అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను ఈ మూవీ అందుకుంది.

ఇక కొంత కాలం క్రితం  వీరి కాంబోలో పుష్ప పార్ట్ 1 అనే మూవీ వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం వీరి కాంబో లో పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతుంది. పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మాత్రం పెండింగ్ లోనే ఉంది. దానితో ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల అవుతుందా .? లేదా అని అనుమానాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం పుష్ప మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సాంగ్ షూటింగ్ తో ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతున్నట్లు సమాచారం. ఈనెల 25 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ను ఫినిష్ చేసే విధంగా సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కచ్చితంగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేసేందుకు ఈ మూవీ యూనిట్ పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ కు విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>