MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya81b63253-7e94-4670-9b9d-6db75975c0de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya81b63253-7e94-4670-9b9d-6db75975c0de-415x250-IndiaHerald.jpgఈ క్రమంలో ఈ డాకు మహారాజ్ ఎవరు అనే వెతకటం సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. అయితే ఇంతకీ డాకు మాకారాజ్‌ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. అసలు మేటర్ లోకి వెళితే డాకు మాన్ సింగ్ 1980లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నకేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. చంబాలే ఏరియాలో పెరిగిన మాన్ సింగ్‌ 17 మంది అనుచరులతో కలిసి భారీ ముఠాను ఏర్పాటు చేసుకుని దొంగతనాలు చేసేవాడు. అదే క్రమంలో ఆయన అనుచరులను కూడా పెంచుకుంటూ వెళ్లిన మాన్ సింగ్ పరోక్షంగా ప్రత్యక్షంగా 500 మందిపైగా అనుచరులతో కలిసి పనిచేసేవాడు. balayya{#}sithara;Kshatriya;Murder.;temple;lion;Balakrishna;Darsakudu;Director;police;Government;Tollywood;Yevaru;House;Cinema;nagaబాలయ్య డాకు మహారాజ్ క‌థ‌కి .. డాకు మాన్సింగ్ కు ఉన్న లింకుదే.. అసలు స్టోరీ అదిరిపోయింది గా..!బాలయ్య డాకు మహారాజ్ క‌థ‌కి .. డాకు మాన్సింగ్ కు ఉన్న లింకుదే.. అసలు స్టోరీ అదిరిపోయింది గా..!balayya{#}sithara;Kshatriya;Murder.;temple;lion;Balakrishna;Darsakudu;Director;police;Government;Tollywood;Yevaru;House;Cinema;nagaSun, 24 Nov 2024 12:46:20 GMTనట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్.. టాలీవుడ్ క్రేజీ దర్శకుడు బాబి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక్క టైటిల్ టీజర్ తోనే ఈ సినిమా పై అంచనాలను ఎవరు ఊహించని రేంజ్ లో పెంచేసాడు డాకు మహారాజ్.. ఈ క్రమంలో ఈ డాకు మహారాజ్ ఎవరు అనే వెతకటం సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. అయితే ఇంతకీ డాకు మాకారాజ్‌ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. అసలు మేటర్ లోకి వెళితే డాకు మాన్ సింగ్ 1980లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నకేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. చంబాలే ఏరియాలో పెరిగిన మాన్ సింగ్‌ 17 మంది అనుచరులతో కలిసి భారీ ముఠాను ఏర్పాటు చేసుకుని దొంగతనాలు చేసేవాడు. అదే క్రమంలో ఆయన అనుచరులను కూడా పెంచుకుంటూ వెళ్లిన మాన్ సింగ్ పరోక్షంగా ప్రత్యక్షంగా 500 మందిపైగా అనుచరులతో కలిసి పనిచేసేవాడు.


అదే క్రమంలో ఆయనపై 125 హత్య కేసులు ,1112  దోపిడీ కేసులు మాత్రమే కాకుండా లెక్కలేని కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి అంటారు. ఇవే కాకుండా 32 మంది పోలీసులను నరికి చంపిన నేరస్తుడిగా ఆయనపై అభియోగాలు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల వందమందికి పైగా పోలీసులు 15 సంవత్సరాల పాటు అతని కోసం ఎంతగానో గాలించిన అతని పట్టుకోలేకపోయారు. అయితే ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే మరోవైపు అతను రాజ్యం లేని మహారాజు కొన్ని వేలమంది ఆయన్ని దేవుడులా కొలిచేవారు. ఇప్పటికీ ఆయనకి గుడి కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. మాన్ సింగ్ చిన్నప్పటినుంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు .. పెరిగి పెద్దయ్యక కూడా ఊర్లో ఉన్న చిన్న చిన్న పంచాయతీలకు తీర్పులు కూడా చెప్పేవాడు .. ఆయన ఎదుగుదలను చూసి కొందరు రౌడీలు వడ్డీ వ్యాపారులు ఓర్చుకోలేకపోయారు. దాంతో ఆయనపై కోపంతో కుట్రలు చేయడం మొదలు పెట్టారు.


ఇక దాంతో మాన్ సింగ్ భూమిని అన్యాయంగా లాక్కుని తప్పుడు కేసులు పెట్టి జైలకు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మాన్సింగ్ కోపంతో తాను జైలుకెళ్లడానికి కారణమైన వాళ్లపై దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి చంబల్ లోయలోకి పారిపోయాడు. కానీ.. కొన్నాళ్లకు అక్కడ నుంచి తిరిగి ఊరికి వచ్చి.. పోలీసులకు దొరికిపోయాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాన్ సింగ్‌ను మళ్ళీ జైలు శిక్ష విధించింది. జైల్లో ఉన్నప్పుడే మాన్సింగ్ ఇద్దరు కొడుకులు జస్వంత్, ధ‌న్వ‌ర్‌ సింగ్‌ల‌ను ఎన్కౌంటర్‌లో చంపేశారు. 1939లో జైలు నుంచి రిలీజై.. కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కొడుకులని చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక ఆయన దోపిడీలు చేసిన మాట కూడా వాస్తవమే. కానీ.. ఆ దోపిడి డబ్బు అంతా పేదల కడుపు నింపడానికే.. ధనికుల ఇల్లు దోచి.. పేదల జేబులు నింపేవాడు. ఆడవాళ్ళను గౌరవించేవాడు. ఎంతో మంది అమ్మాయిల పెళ్లిళ్లు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రా చుట్టుపక్కల జిల్లాల్లో మాన్ సింగ్ దేవుడయ్యాడు. ఇప్పుడు బాలయ్య అదే స్టోరీ తో ఈ సంక్రాంతికి వస్తున్నాడు. ఇక మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>