PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedకాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మంత్రిగా ఉన్న బోస్ .. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టిన వెంటనే తన మంత్రి పదవి , ఎమ్మెల్యే పదవి వదులుకొని వైసీపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014, 2019 ఎన్నికలలోను ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ లెక్క‌న చూస్తే బోస్ వ‌రుస‌గా 2012 ఉప ఎన్నిక ల తో పాటు ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు సాధార‌ణ ఎన్నిక‌లు.. మొత్తం మూడు సార్లు ఓడిపోయారు. Pilli Bose{#}surya sivakumar;Pilli Subhash Chandra Bose;Hanu Raghavapudi;Rajya Sabha;East Godavari;Assembly;MLA;Varasudu;Rajahmundry;Venu Thottempudi;dr rajasekhar;YCP;Minister;Jagan;Congress;Indiaపిల్లి బోస్ వారసుడికి జగన్ మార్క్ షాక్ తప్పదా ..!పిల్లి బోస్ వారసుడికి జగన్ మార్క్ షాక్ తప్పదా ..!Pilli Bose{#}surya sivakumar;Pilli Subhash Chandra Bose;Hanu Raghavapudi;Rajya Sabha;East Godavari;Assembly;MLA;Varasudu;Rajahmundry;Venu Thottempudi;dr rajasekhar;YCP;Minister;Jagan;Congress;IndiaSat, 23 Nov 2024 09:22:29 GMT- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .

పిల్లి సుభాష్ చంద్రబోస్ నిజాయితీపరులు అయిన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మంత్రిగా ఉన్న బోస్ .. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టిన వెంటనే తన మంత్రి పదవి , ఎమ్మెల్యే పదవి వదులుకొని వైసీపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014, 2019 ఎన్నికలలోను ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ లెక్క‌న చూస్తే బోస్ వ‌రుస‌గా 2012 ఉప ఎన్నిక ల తో పాటు ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు సాధార‌ణ ఎన్నిక‌లు.. మొత్తం మూడు సార్లు ఓడిపోయారు.


అయినా కూడా బోస్ మీద ఉన్న అభిమానంతో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే బోస్‌ను ఎమ్మెల్యే చేసి.. తన కేబినెట్‌లో మంత్రిగా తీసుకున్నారు. అనంతరం బోస్‌కు రాజ్యసభ పదవి కట్టబెట్టారు. ఈ ఏడాది ఎన్నికలలో బోస్ తనయుడు సూర్య ప్రకాష్‌కు జగన్ రామచంద్రపురం ఎమ్మెల్యే సీటు కేటాయించగా ఆయన ఓడిపోయారు. వాస్తవంగా మొన్నటి వరకు రామచంద్రపురం ఎమ్మెల్యేగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఉండేవారు. పిల్లి బోస్ తన వారసుడికి సీటు కోసం పట్టుబట్టడంతో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ కు మార్చారు.


అయితే ఇప్పుడు మార్పులు చేర్పులలో భాగంగా వేణుగోపాలకృష్ణను తిరిగి రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయినా కూడా ఆయనకు రాజమహేంద్రవరం రూరల్ కాకుండా రామచంద్రపురం సమన్వయకర్త ఇచ్చే ఆలోచన జగన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లి బోస్ వారసుడు పిల్లి సూర్య ప్రకాష్‌ను ప్రస్తుతానికి తప్పించి భవిష్యత్తులో ఏదో ఒక పదవి కట్టబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జనవరిలో నందమూరి అభిమానులకు ఊహించిన అప్డేట్ .. బాలయ్య కల నెరవేరే ఛాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>