Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rrrdff898fa-4e39-4d82-8643-6628828cf6be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rrrdff898fa-4e39-4d82-8643-6628828cf6be-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ ఆర్ఆర్ఆర్( రౌద్రం, రణం, రుధిరం)’.. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ ఇది.. బాహుబలితో ఇండియన్ సినిమా రేంజ్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతకు మించిన విజయం అందుకున్నాడు.. మొదట ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమా అనౌన్స్ చేసాక.. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ని రాజమౌళి ఎలా మేనేజ్ చేస్తారని అందరికి ఒకటే సందేహం..అలాంటి వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చారు..#RRR{#}NTR;Ram Charan Teja;m m keeravani;prem;ram pothineni;Rajamouli;srinivas;India;Alluri Sitarama Raju;Komaram Bheem;RRR Movie;Telugu;king;Audience;Blockbuster hit;Hero;King;Rahul Sipligunj;INTERNATIONAL;Indian;Play back;Kalabhairava;Oscar;James Cameron;Chitram;Cinema;Directorజాతీయ,అంతర్జాతీయ అవార్డులతో చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'..!!జాతీయ,అంతర్జాతీయ అవార్డులతో చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'..!!#RRR{#}NTR;Ram Charan Teja;m m keeravani;prem;ram pothineni;Rajamouli;srinivas;India;Alluri Sitarama Raju;Komaram Bheem;RRR Movie;Telugu;king;Audience;Blockbuster hit;Hero;King;Rahul Sipligunj;INTERNATIONAL;Indian;Play back;Kalabhairava;Oscar;James Cameron;Chitram;Cinema;DirectorSat, 23 Nov 2024 08:26:50 GMTటాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ ఆర్ఆర్ఆర్( రౌద్రం, రణం, రుధిరం)’.. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వంటి బ్లాక్ బస్టర్  హిట్ తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ ఇది.. బాహుబలితో ఇండియన్ సినిమా రేంజ్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతకు మించిన విజయం అందుకున్నాడు.. మొదట  ఇద్దరు బిగ్ స్టార్స్ తో  సినిమా అనౌన్స్ చేసాక.. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ని రాజమౌళి ఎలా మేనేజ్ చేస్తారని అందరికి ఒకటే సందేహం..అలాంటి వారికి రాజమౌళి  అదిరిపోయే సమాధానం ఇచ్చారు.. నేను ఎంచుకున్న కథకు వీళ్ళను తీసుకున్నాను కానీ.. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేయలేదు.. నాకు కథ మాత్రమే అసలైన హీరో అని రాజమౌళి చెప్పుకొచ్చారు.. రాజమౌళి చెప్పినట్లుగా ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ ని ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా అద్భుతంగా సినిమా తీసాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించి మెప్పించారు..

సినిమా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అయిన జేమ్స్ కామెరున్,స్పిల్ బర్గ్ వంటి దిగ్గజాలను సైతం మెప్పించింది.. ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ వేదికగా మంచి గుర్తింపు లభించింది..ఈ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నాటు నాటు సాంగ్ తో పాటు అందులోని లిరిక్స్, రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్..  ఇవన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దీంతో ఈ పాటకు వరుసపెట్టి అంతర్జాతీయ అవార్డ్స్ రావడం, భారతీయుడి సత్తా ప్రపంచవ్యాప్తంగా మరోసారి రెపరెపలాడం ఇలా వరుసగా జరిగిపోయాయి.నాటు నాటు డాన్స్‌ కు భారతీయులే కాదు.. ప్రపంచ ప్రేక్షకులు సైతం దాసోహం అన్నారు. ముఖ్యంగా ఈపాటకు డాన్స్ మూమెంట్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్‌కు మంచి పేరు వచ్చింది.అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నాటు నాటు పాటకు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అతికినట్టు సరిపోయింది. ఈ పాటను రాసిన చంద్రబోస్, బాణీలు సమకూర్చిన కీరవాణికి ఆస్కార్ దాసోహం అయింది.

ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అని చెప్పాలి.  దక్షిణ భారత దేశం కాదు  మన దేశం నుంచి ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఇదే తొలిసారి..అంతేకాదు ఒక పూర్తి స్థాయి భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. ఉత్తమ చిత్రం విభాగంలో కాకుండా, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ అవార్డు రావడం పై దేశ వ్యాప్తంగా అందరు చిత్ర యూనిట్ ని ప్రశంసించారు..నాటు నాటు పాట ఆస్కార్ తో కలిపి ఏకంగా 9 అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుంది..వాటిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఎంతో ప్రత్యేకమైంది..ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ అవార్డులే కాదు జాతీయ అవార్డులు కూడా లభించాయి..69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు సాధించింది.6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆర్ఆర్ఆర్. 6 అవార్డ్స్ ఏఏ కేటగిరిలో వచ్చాయి అంటే..బెస్ట్ పాపులర్ మూవీ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - కాలభైరవ (ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో పాట), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ - కింగ్ సోలోమాన్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - వీ శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) అవార్డులు వచ్చాయి.ఇలా జాతీయ,అంతర్జాతీయ వేదికలలో ఆర్ఆర్ఆర్ కి అవార్డ్స్ పంట పడింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జనవరిలో నందమూరి అభిమానులకు ఊహించిన అప్డేట్ .. బాలయ్య కల నెరవేరే ఛాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>