PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-832d3bc9-b961-423d-9b7c-f16e3a7eb41f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-832d3bc9-b961-423d-9b7c-f16e3a7eb41f-415x250-IndiaHerald.jpgమూడు పార్టీలు ఒకటి కావడంతో పాటు మూడు పార్టీల ఓటు బ్యాంకు కలిసికట్టుగా ఒకటి కావడంతో కూటమి ఘనవిజయం సాధించింది. ఇప్పటికే రెండు విడ‌త‌లు గా చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇచ్చిన పదవులు చూస్తే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు దేక్కాయి. Chandrababu {#}krishnam raju;Friday;Bhimavaram;Vemuri Radhakrishna;Tanuku;Telugu Desam Party;District;CBN;Minister;Janasena;Telangana Chief Minister;MLA;Government;kalyan;Indiaఈ ముగ్గురు నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన చంద్ర‌బాబు... !ఈ ముగ్గురు నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన చంద్ర‌బాబు... !Chandrababu {#}krishnam raju;Friday;Bhimavaram;Vemuri Radhakrishna;Tanuku;Telugu Desam Party;District;CBN;Minister;Janasena;Telangana Chief Minister;MLA;Government;kalyan;IndiaSat, 23 Nov 2024 13:32:53 GMT- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఇప్పుడిప్పుడే కార్పొరేషన్ తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల ఎంపిక జరుగుతుంది. అయితే చంద్రబాబు ఆచితూచి పదవులు పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన - బిజెపికి చెందిన పార్టీలు ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశంతో పాటు జనసేన - బిజెపికి చెందిన చాలామంది నేతలు చాలా నియోజకవర్గాలలో సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితిలు వచ్చాయి. మూడు పార్టీలు ఒకటి కావడంతో పాటు మూడు పార్టీల ఓటు బ్యాంకు కలిసికట్టుగా ఒకటి కావడంతో కూటమి ఘనవిజయం సాధించింది. ఇప్పటికే రెండు విడ‌త‌లు గా చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇచ్చిన పదవులు చూస్తే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు దేక్కాయి.


ఏపీసీ చైర్మన్గా భీమవరం నుంచి జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును ఎంపిక చేశారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి విజయం సాధించారు. ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు వెళ్లి ... జనసేన కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అదే కమిటీకి సభ్యుడుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎంపికయ్యారు. రాధాకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఇటీవల ఉండి శాసనసభ్యుడు రఘురామ‌ కృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి వరించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా నేతలను కీలక పదవులు వ‌రించాయి. దీంతో శుక్రవారం వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. ర‌ఘురామ కృష్ణం రాజు త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకుంటే ఆయ‌న‌కు చంద్ర‌బాబు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి తో సరిపెట్టేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గ్యారంటీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>