Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-77449c91-f568-4cab-a832-7a411e07ad76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-77449c91-f568-4cab-a832-7a411e07ad76-415x250-IndiaHerald.jpgకర్ణాటక రాష్ట్రంలోని కుందాపుర్‌లో ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో వేగంగా దూసుకుపోతున్న ఓ ట్రక్‌ ఒక కారును ఢీ కొట్టింది. ఆ కారును లాక్కొని వెళ్లింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణీకులు, ట్రక్‌ డ్రైవర్‌తో కలిపి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. viral {#}Goa;Toyota;Fish;police;Carహైవేలపై ఇలా అస్సలు చేయకండి.. ప్రాణాలు పోతాయి.. వైరల్ వీడియో?హైవేలపై ఇలా అస్సలు చేయకండి.. ప్రాణాలు పోతాయి.. వైరల్ వీడియో?viral {#}Goa;Toyota;Fish;police;CarFri, 22 Nov 2024 14:40:00 GMTకర్ణాటక రాష్ట్రంలోని కుందాపుర్‌లో ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో వేగంగా దూసుకుపోతున్న ఓ ట్రక్‌ ఒక కారును ఢీ కొట్టింది. ఆ కారును లాక్కొని వెళ్లింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణీకులు, ట్రక్‌ డ్రైవర్‌తో కలిపి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సీసీ ఫుటేజ్‌లో కారు లైట్లు వెలిగించి రోడ్డు ఎడమ వైపున రివర్స్‌లో పార్క్ చేసి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతలో వేగంగా దూసుకుపోతున్న ట్రక్కు కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడింది. కుంభాశి చండీక దుర్గాపర్మేశ్వరి దేవాలయం వద్ద ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన ఏడుగురు మంది టయోటా కారుతో దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి రివర్స్ తీస్తుండగా, గోవా నుంచి కేరళకు చేపలు తీసుకువస్తున్న మంగళూరుకు చెందిన ఒక ట్రక్‌ దీన్ని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారును కొన్ని మీటర్ల దూరం వరకు లాక్కొని వెళ్లిన ట్రక్‌ ఒక బోర్డు ముందు ఆగిపోయింది. ఈ ఘటనలో కారు పొదలలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కారులోని ఏడుగురు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యక్తులు ఉడుపిలోని కోల్లూరు దేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి కేరళకు వెళ్తున్నారు.

ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్‌ డ్రైవర్‌తో సహా అందరిని మణిపాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. కేరళకు చెందిన కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైవేపై రివర్స్ వెళ్లడమే కారు డైవర్ చేసిన పెద్ద తప్పిదమని తెలుస్తోంది హైవేపై లారీలు బస్సులు ఇంకా వేరే కార్లు చాలా వేగంగా వస్తాయి. చూసుకోకుండా రహదారి పైకి ఎక్కేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ఇలాంటి తప్పులు చేసి ప్రమాదాల బారిన పడ్డారు. కొందరు చనిపోయారు కూడా  అందుకే హైవేలపై రివర్స్ తీసుకునేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

" style="height: 813px;">












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమన్నా షాకింగ్‌ నిర్ణయం..పెళ్లికి ముందే రొమాంటికి డెషిషన్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>