MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-alluduaeb73350-5109-4940-b609-431d8ff43604-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-alluduaeb73350-5109-4940-b609-431d8ff43604-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో హీరో పాత్ర భార్య , ప్రియురాలి మధ్య ఇరుక్కపోయి నలిగిపయే కథతో వచ్చిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలతో చాలా తక్కువ సినిమాలే వస్తున్న తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ఈ తరహా కథలతో అనేక సినిమాలలో నటించారు. ఎన్నో విజయాలను అందించారు. నాగార్జున కూడా ఈ తరహా కథల్లో రూపొందిన అనేక సినిమాల్లో నటించాడు. అందులో చాలా మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇక అలాంటి సినిమాలలో అల్లరి అల్లుడు మూవీ ఒకటి. ఈ మూవీallari alludu{#}Nagma;meena;Allari;Akkineni Nagarjuna;Telugu;Balakrishna;Chiranjeevi;Venkatesh;Hero;Wife;college;Cinema;marriageఅల్లరి అల్లుడు : నగ్మా కు బుద్ధి చెప్పేందుకు నాగ్ అలాంటి స్కెచ్.. చివరకు సినిమా రిసల్ట్ అదే అదే..?అల్లరి అల్లుడు : నగ్మా కు బుద్ధి చెప్పేందుకు నాగ్ అలాంటి స్కెచ్.. చివరకు సినిమా రిసల్ట్ అదే అదే..?allari alludu{#}Nagma;meena;Allari;Akkineni Nagarjuna;Telugu;Balakrishna;Chiranjeevi;Venkatesh;Hero;Wife;college;Cinema;marriageThu, 21 Nov 2024 10:16:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో హీరో పాత్ర భార్య , ప్రియురాలి మధ్య ఇరుక్కపోయి నలిగిపయే కథతో వచ్చిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలతో చాలా తక్కువ సినిమాలే వస్తున్న తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ఈ తరహా కథలతో అనేక సినిమాలలో నటించారు. ఎన్నో విజయాలను అందించారు. నాగార్జున కూడా ఈ తరహా కథల్లో రూపొందిన అనేక సినిమాల్లో నటించాడు. అందులో చాలా మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు.

ఇక అలాంటి సినిమాలలో అల్లరి అల్లుడు మూవీ ఒకటి. ఈ మూవీలో నగ్మా , మీనా హీరోయిన్లుగా నటించగా ... ఏ కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున , నగ్మా చదివే కాలేజీ  వ్యాంటీన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్య మొదట గొడవ అవుతుంది. ఇక ఆ తర్వాత నగ్మా , నాగార్జునకు దగ్గరకి అవుతుంది. దగ్గర అయ్యి ప్రేమించాను అని చెప్పి అతని మోసం చేస్తుంది. ఇక ఆ మోసం వల్ల నాగార్జున అనేక మాటలు పడడంతో ఎలాగైనా ఆమెపై కోపం తీర్చుకోవాలి అని చెప్పి నగ్మా ఇంటికి వెళ్లి తన చెల్లి అయినటువంటి మీనా ను పెళ్లి చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత నగ్మా ఎంట్రీ ఇచ్చి వీడు మంచివాడు కాదు.  

అతన్ని పెళ్లి చేసుకోవద్దు అని చెబుతోంది. దానితో నువ్వు కావలసినే నా పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి మీనా అనడంతో చెల్లె జీవితం నాశనం కాకూడదు అని నగ్మా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దానితో నాగర్జున , నగ్మా కి పెళ్లి జరుగుతుంది. దీనితో నాగర్జున తన కసి తీర్చుకుంటాడు. కానీ ఆ తర్వాత ఓ వైపు భార్య , మరో వైపు ప్రియురాలి మధ్యలో నాగార్జున నలిగిపోతూ ఉంటాడు. ఇలా సినిమా ఎంతో ఫన్ గా ముందుకు సాగుతుంది. ఇక 1993 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండియన్ షేక్ చేస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. అప్పుడేంటి మరి ఇలా ఉన్నాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>