NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/restaurant-1e533ad0-2231-4f7a-92af-8b1c763c4e98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/restaurant-1e533ad0-2231-4f7a-92af-8b1c763c4e98-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఆరోగ్యంగా ఉండి చురుకుగా పనిచేసే వాళ్ళకి ఏ కంపెనీలో అయినా ఇట్టే జాబ్ దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి జాబ్ ఇవ్వాలంటే కంపెనీ నిర్వాహకులు కూడా కాస్త వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మంచిగా పని చేసే వారే కావాలని కోరుకుంటుంది కానీ..అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పనిచేయడంలో ఇబ్బంది పడే వారిని జాబ్ లో పెట్టుకోవాలని అస్సలు అనుకోదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే రెస్టారెంట్లో మాత్రం ఇలా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికే ఉద్యోగాలుrestaurant {#}Japan;Manam;jobమతిమరుపు ఉన్నోళ్లకే ఇక్కడ జాబ్.. అదో వింత రెస్టారెంట్.. ఎక్కడంటే?మతిమరుపు ఉన్నోళ్లకే ఇక్కడ జాబ్.. అదో వింత రెస్టారెంట్.. ఎక్కడంటే?restaurant {#}Japan;Manam;jobThu, 21 Nov 2024 09:15:00 GMTసాధారణంగా ఆరోగ్యంగా ఉండి చురుకుగా పనిచేసే వాళ్ళకి ఏ కంపెనీలో అయినా ఇట్టే జాబ్ దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి జాబ్ ఇవ్వాలంటే కంపెనీ నిర్వాహకులు కూడా కాస్త వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మంచిగా పని చేసే వారే కావాలని కోరుకుంటుంది కానీ..అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పనిచేయడంలో ఇబ్బంది పడే వారిని జాబ్ లో పెట్టుకోవాలని అస్సలు అనుకోదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే రెస్టారెంట్లో మాత్రం ఇలా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికే ఉద్యోగాలు లభిస్తాయి.


 సాధారణంగా ఏ కంపెనీకి వెళ్లి చూసినా అటు మతిమరుపు ఉన్నట్లు తెలిస్తే వారికి జాబ్ ఇవ్వడం కాదు మరోవైపు కంపెనీ దరిదాపుల్లోకి కూడా రావద్దు అని వార్నింగ్ ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఏకంగా మతిమరుపు ఉన్నవారికి ఉద్యోగం ఇస్తారు. అదేంటి మతిమరుపు ఉన్న వారికి ఉద్యోగం ఇస్తే ఇక వాళ్లు ఎలా పని చేస్తారు.. వాళ్ళ మతిమరుపుతో ఏకంగా కస్టమర్లకు సైతం చిరాకు తెప్పిస్తారు కదా అంటారా.. నిజమే మతిమరుపుతో ఒకరు పెట్టిన ఆర్డర్ ని ఇంకొకరికి తెచ్చిస్తూ ఉంటారు. ఇలా చేయడంతోనే ఈ రెస్టారెంట్ బాగా ఫేమస్ అయ్యిందట.


 జపాన్ లోని టోక్యోలో ఉండే రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ లో మతిమరుపు ఉన్న వారిని సర్వర్లుగా నియమిస్తారట. వీరిలో ఒంటరితనం తగ్గించడానికి చురుగ్గా మార్చేందుకు ఇలా చేస్తున్నారట రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ ప్రత్యేకమైన కేఫ్ లో ఆర్డర్లు తప్పుగా వచ్చినా కూడా కస్టమర్లు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారట. 2017లో షిరు ఓగిని అనే వ్యక్తి దీనిని ప్రారంభించగా అటు ఆదరణ పెరగడంతో ఇలాంటివి ఏకంగా 8 రెస్టారెంట్లను ప్రారంభించారట. ఏది ఏమైనా మతిమరుపు ఉన్న వారిని ఉద్యోగులుగా పెట్టుకోవడం అంటే అది పెద్ద సాహసమే కదా.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: నెట్ ఫ్లిక్స్ తో అన్ని కోట్లు బేరం కుదుర్చుకున్న నయనతార..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>