MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunfd39d0e5-de8f-48cc-afdd-4d12e2a21151-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunfd39d0e5-de8f-48cc-afdd-4d12e2a21151-415x250-IndiaHerald.jpgసుకుమార్ ఈ సినిమాను మామూలుగా చెక్క‌డం లేదు. శిల్పా న్ని చెక్కిన‌ట్టుగా చెక్కుకుంటూ వ‌స్తున్నాడు. ఇక రీసెంట్ గా బిహార్ రాజ‌ధాని పాట్నా లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన జనం ను చూశాక ... అలాగే పుష్ప 2 ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి. ఈ సినిమా పై కనివినీ ఎరుగ‌ని రేంజ్ లో అంచ‌నాలు అయితే ఉన్నాయి. Allu Arjun{#}Patna;sree;shilpa;sukumar;Allu Arjun;American Samoa;India;Tollywood;Cinema;Eventబాబోయ్‌... ' పుష్ప 2 ' కు అమెరికాలో ఎన్ని థియేట‌ర్లో తెలుసా... !బాబోయ్‌... ' పుష్ప 2 ' కు అమెరికాలో ఎన్ని థియేట‌ర్లో తెలుసా... !Allu Arjun{#}Patna;sree;shilpa;sukumar;Allu Arjun;American Samoa;India;Tollywood;Cinema;EventThu, 21 Nov 2024 16:41:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అది పుష్ప 2 సినిమా గురించే .. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా కోసం గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా క‌ళ్లు కాయ‌లు కాచేలా ప్ర‌తి ఒక్క‌రు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి ఎప్పుడు వ‌స్తుంది ? ఎప్పుడు చూస్తాం అన్న ఆశ‌లు అయితే మామూలుగా లేవు. సుకుమార్ ఈ సినిమాను మామూలుగా చెక్క‌డం లేదు. శిల్పా న్ని చెక్కిన‌ట్టుగా చెక్కుకుంటూ వ‌స్తున్నాడు. ఇక రీసెంట్ గా బిహార్ రాజ‌ధాని పాట్నా లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన జనం ను చూశాక ... అలాగే పుష్ప 2 ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి. ఈ సినిమా పై కనివినీ ఎరుగ‌ని రేంజ్ లో అంచ‌నాలు అయితే ఉన్నాయి.


ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో ఉంటే..పాట్నా ఈవెంట్ దీన్ని మరింత పెంచింది అన‌డం లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంకా అల్లు అర్జున్, శ్రీ లీల కలిసి చేసిన స్పెషల్ సాంగ్ తో పాటు ఇతర అప్ డేట్స్ వస్తే ఇది ఎక్కడికి చేరుతుందో చూడాలి. ఇక ఓవ‌ర్సీ స్ లో .. మ‌రీ ముఖ్యంగా అమెరికా లో పుష్ప 2 సినిమా ఏకంగా 3230 థియేటర్ల లో విడుదల కానుంది. విడుదల నాటికీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మరో వైపు ప్రీ సేల్స్ లోనే అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిన సినిమాగా అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డు నమోదు చేసింది. మరో వైపు పుష్ప 2 ట్రైలర్ ఇప్పటికే 120 మిలియన్స్ అంటే 12 కోట్ల వ్యూస్ సాధించింది.  ఇది అతి పెద్ద రికార్డు గా చెప్పుకోవాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి వయసుకు కూతురు...అంతలోనే తల్లి ప్రెగ్నెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>