Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthn-tipscb098756-fcf4-418d-9281-9b9964fb54d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthn-tipscb098756-fcf4-418d-9281-9b9964fb54d8-415x250-IndiaHerald.jpgచాలామంది ప్రజలు పొట్ట మీద అంటే బోర్లా పడుకోవడానికి బాగా ఇష్టపడతారు. అయితే పొట్ట మీద పడుకోవడం చాలామందికి సౌకర్యంగా అనిపించినా, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది గొంతు నొప్పి, నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలను తగ్గించవచ్చు. కానీ, వీపు, మెడ నొప్పులకు దారి తీసి, మంచి నిద్ర పట్టకుండా చేస్తుంది. దీంతో మనం రోజంతా అలసటగా, నీరసంగా ఉంటాము. healthn tips{#}Manamబోర్లా పడుకుంటున్నారా.. వద్దే వద్దంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?బోర్లా పడుకుంటున్నారా.. వద్దే వద్దంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?healthn tips{#}ManamThu, 21 Nov 2024 13:56:00 GMTచాలామంది ప్రజలు పొట్ట మీద అంటే బోర్లా పడుకోవడానికి బాగా ఇష్టపడతారు. అయితే పొట్ట మీద పడుకోవడం చాలామందికి సౌకర్యంగా అనిపించినా, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది గొంతు నొప్పి, నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలను తగ్గించవచ్చు. కానీ, వీపు, మెడ నొప్పులకు దారి తీసి, మంచి నిద్ర పట్టకుండా చేస్తుంది. దీంతో మనం రోజంతా అలసటగా, నీరసంగా ఉంటాము.

గర్భవతులైతే పొట్ట మీద పడుకోవడం మరింత ప్రమాదకరం. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యాలకు హాని కలిగించవచ్చు. బోర్లా పడుకుంటే మన వెన్నుముక ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అది ఎలా అంటే, మనం పొట్ట మీద పడికోవడం వల్ల మన శరీర బరువు అంతా మధ్య భాగానికి చేరుకుంటుంది. దీంతో మన వెన్నుముక తన సహజ స్థితిని కోల్పోయి ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి వల్ల వెన్నునొప్పి మాత్రమే కాకుండా, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు. దీర్ఘకాలంగా ఈ అలవాటును కొనసాగిస్తే ఇంకా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బోర్లా పడుకోవడం వల్ల మన వెన్నుముక మీద మాత్రమే కాకుండా, మెడ, ముఖం మీద కూడా ప్రభావం పడుతుంది. మనం పొట్ట మీద పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి తలను ఒక వైపు తిప్పాల్సి ఉంటుంది. దీంతో మెడ వంగి ఒత్తిడికి గురవుతుంది. దీర్ఘకాలంగా ఇలా చేస్తే మెడ నొప్పులు మొదలవుతాయి. కొన్ని సందర్భాల్లో వెన్నుముకలోని డిస్క్‌లు బయటకు జారి నరాలపై ఒత్తిడి తెచ్చి నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిని హెర్నియేటెడ్ డిస్క్ అంటారు.

ఇంతేకాకుండా, బోర్లా పడుకున్నప్పుడు ముఖం ఒక వైపు దిండుపై రుద్దబడుతుంది. దీంతో ముఖం మీద చర్మం సాగి ముడతలు పడే అవకాశం ఉంటుంది. అంటే, పొట్ట మీద పడుకోవడం వల్ల మనం ముందే వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నట్లే. వృద్ధాప్య ఛాయలు కనపడేవారు ఇలా పడుకోవడానికి మానేయాలి ఎడమవైపు తిరిగి పడుకునేలా అలవాటు చేసుకోవాలి. అలాగే పడుకునే ముందు మెడిటేషన్ లాంటివి చేయాలి. పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే అన్నం తింటే మంచిగా జీర్ణం అవుతుంది. డైజెస్టివ్ హెల్త్ బాగుంటుంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరింది బాసు .. 20 ఏళ్ల తర్వాత సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>