Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---77ab1ab9-b2fd-48c4-89bf-646e6966185f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---77ab1ab9-b2fd-48c4-89bf-646e6966185f-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగానే గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి ఒకరైతే.. అటు తమిళ చిత్ర పరిశ్రమలో శంకర్ ఒకరు. శంకర్ దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు.. అందులో ఏదో ప్రయోగం చేయబోతున్నాడు అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు శంకర్ కెరియర్ లో చేసినవన్నీ కూడా ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలే అని చెప్పాలి. ఇలా తన సాహసాలతో కొన్ని కొన్ని సార్లు శంకర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తే.. ఇంకొన్నిసార్లు మాత్రం ఇక ప్రేక్షకులను మెప్పించలేక డీలపడిశంకర్{#}GEUM;Rajamouli;Audience;Blockbuster hit;shankar;Ram Charan Teja;Tamil;Indian;Cinemaతగ్గేదేలే అంటున్న శంకర్.. ఫ్లాప్ సినిమాకి 100 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడుగా?తగ్గేదేలే అంటున్న శంకర్.. ఫ్లాప్ సినిమాకి 100 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడుగా?శంకర్{#}GEUM;Rajamouli;Audience;Blockbuster hit;shankar;Ram Charan Teja;Tamil;Indian;CinemaThu, 21 Nov 2024 07:45:00 GMTసౌత్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగానే గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి ఒకరైతే.. అటు తమిళ చిత్ర పరిశ్రమలో శంకర్ ఒకరు. శంకర్ దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు.. అందులో ఏదో ప్రయోగం చేయబోతున్నాడు అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు శంకర్ కెరియర్ లో చేసినవన్నీ కూడా ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలే అని చెప్పాలి. ఇలా తన సాహసాలతో కొన్ని కొన్ని సార్లు శంకర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తే.. ఇంకొన్నిసార్లు మాత్రం ఇక ప్రేక్షకులను మెప్పించలేక డీలపడిన సందర్భాలు ఉన్నాయి.


 కాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే.. ఇక ఇప్పుడు ఒక డిజాస్టర్ సినిమా కోసం శంకర్ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడు అన్న వార్త అందరిని షాక్ కి గురిచేస్తుంది. శంకర్ కెరియర్లో మైలురాయిగా నిలిచిన సినిమాలలో ఒకటి ఇండియన్. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 తెరకెక్కించాడు శంకర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.


 ఇండియన్ 2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మూడవ భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 50% పూర్తి చేశారు. ఇక ఇండియన్ 2 ఎండ్ కార్ట్ పడేటప్పుడు మూడవ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ని వేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇండియన్ టు ఫ్లాప్ కావడంతో ఇండియన్ త్రీ రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు శంకర్ మాత్రం అస్సలు వెనకడుగు వేయట్లేదట. ఏకంగా ఫ్లాప్ మూవీ గా నిలిచిన ఇండియన్ 2 సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ కూడా పెట్టేందుకు రెడీ అయ్యాడట. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించి హిట్టు కొట్టాలనే కసి శంకర్ లో పెరిగిపోయిందట. గేమ్ చేంజర్ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇక ఇండియన్ 2 సీక్వెల్ పై దృష్టి పెట్టబోతున్నాడట శంకర్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: నెట్ ఫ్లిక్స్ తో అన్ని కోట్లు బేరం కుదుర్చుకున్న నయనతార..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>