LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/manavatvan-chatina-nara-lokesh-vishayam-teliste-shebash-anakunda-undaleru-5214398d-87da-44be-9eb3-022806e45d8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/manavatvan-chatina-nara-lokesh-vishayam-teliste-shebash-anakunda-undaleru-5214398d-87da-44be-9eb3-022806e45d8c-415x250-IndiaHerald.jpgబాల్యం ఒక వరం.. ఆ సమయం పోతే మళ్లీ తిరిగి రాదు. బాధలు, బాధ్యతలు లేకుండా సాఫీగా గడపాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్ని అందరూ చాలా ఇష్టపడతారు. అయితే, ప్రతి ఒక్కరికీ అందమైన బాల్యం ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. విధి వెక్కిరించినా, తల్లిదండ్రుల తప్పిదాలైనా.. కారణమేదైనా.. ఆనందంగా ఉండాల్సిన బాల్యం కష్టతరంగా మారుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఏకంగా స్పందించారు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన పిల్లాడు వీధుల్లో అడుక్కుంటున్lokesh{#}SantDinesh Chandra Yadavosh Kumar;RTC;Lokesh;Lokesh Kanagaraj;jeevitha rajaseskhar;media;Minister;local languageమానవత్వం చాటిన నారా లోకేశ్ ! విషయం తెలిస్తే శెభాష్ అనకుండా ఉండలేరు?మానవత్వం చాటిన నారా లోకేశ్ ! విషయం తెలిస్తే శెభాష్ అనకుండా ఉండలేరు?lokesh{#}SantDinesh Chandra Yadavosh Kumar;RTC;Lokesh;Lokesh Kanagaraj;jeevitha rajaseskhar;media;Minister;local languageThu, 21 Nov 2024 14:14:53 GMTబాల్యం ఒక వరం.. ఆ సమయం పోతే మళ్లీ తిరిగి రాదు. బాధలు, బాధ్యతలు లేకుండా సాఫీగా గడపాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్ని అందరూ చాలా ఇష్టపడతారు. అయితే, ప్రతి ఒక్కరికీ అందమైన బాల్యం ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. విధి వెక్కిరించినా, తల్లిదండ్రుల తప్పిదాలైనా.. కారణమేదైనా.. ఆనందంగా ఉండాల్సిన బాల్యం కష్టతరంగా మారుతుంది.



తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఏకంగా స్పందించారు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన పిల్లాడు వీధుల్లో అడుక్కుంటున్నాడు. బలపం పట్టాల్సినటువంటి ఆ చేయి రూపాయి కోసం వేడుకుంటుండడం చూసి హృదయం ద్రవించింది. ఒంటి నిండా రంగులతో రోడ్డు పక్కన అడుక్కుంటూ దయనీయ స్థితిలో కనిపించడం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సంతోష్ కుమార్ అనే సోషల్ మీడియా కార్యకర్త ఈ వీడియోను ట్యాగ్ చేసి మంత్రి లోకేష్ స్పందించాలని కోరారు.



 దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. బాలుడిని తక్షణమే కాపాడుతామని, చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది హృదయ విదారక సంఘటన. ప్రతి బిడ్డకు సమాజంలో భద్రత, ప్రేమ, గౌరవం అవసరం. మేము బిడ్డను గుర్తించి, అవసరమైన రక్షణ, సంరక్షణ చర్యలు తీసుకుంటాము. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


వీడియోలోని చిన్నారి కర్ణాటకకు చెందినదని స్థానిక యాచకులు తెలిపారు.  ఈ చిన్నారి ఆచూకీ తెలుసుకునే క్రమంలో గుంతకల్లకు చెందిన మరో చిన్నారిని గుర్తించినట్లు తెలిపారు.  కర్నూలులోని రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఈ ముఠా చిన్నారులను అడుక్కునేలా చేస్తోంది. ఆ చిన్నారులకు సరైన ఆహారం కూడా ఇవ్వకుండా గంజాయి, వైట్‌నర్‌కు బానిసలుగా మారుస్తున్నారనే విమర్శలున్నాయి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరింది బాసు .. 20 ఏళ్ల తర్వాత సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>