DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu5f530f07-4f94-4f97-9849-87d4238fb049-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu5f530f07-4f94-4f97-9849-87d4238fb049-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం అయిదు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే ఇపుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా వాలంటీర్ల విషయంలో హామీ అమలు కాలేదు. దాంతో ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వాలంటీర్లు అయితే ఇప్పటికే నిరసనలు ఆందోళనలు చేస్తూ పోతున్నారు. ప్రభుత్వం పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి ఉంది అన్నది వైసీపీ నేతలు శాసనమండలి వేదికగా ద్వారా చాలా వరకూ బయట పెట్టchandrababu{#}Dola Bala Veeranjaneyaswamy;BOTCHA SATYANARAYANA;Sasanamandali;Minister;Jagan;YCP;Governmentవాలంటీర్లకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారా?వాలంటీర్లకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారా?chandrababu{#}Dola Bala Veeranjaneyaswamy;BOTCHA SATYANARAYANA;Sasanamandali;Minister;Jagan;YCP;GovernmentThu, 21 Nov 2024 13:29:00 GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం అయిదు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.  అయితే ఇపుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా వాలంటీర్ల విషయంలో హామీ అమలు కాలేదు. దాంతో ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వాలంటీర్లు అయితే ఇప్పటికే నిరసనలు ఆందోళనలు చేస్తూ పోతున్నారు.


ప్రభుత్వం పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి ఉంది అన్నది వైసీపీ నేతలు శాసనమండలి వేదికగా ద్వారా చాలా వరకూ బయట పెట్టే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


దానికి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి బదులిస్తూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని ఆయన అసలు విషయం చెప్పారు. గత ఏడాది ఆగస్టు తరువాత వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.


దాంతో ప్రభుత్వం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని మంత్రి చెప్పడం విశేషం. అంతే కాదు లేని ఉద్యోగులకు ఎలా వేతనాలు చెల్లించాలని మంత్రి డోలా ఎదురు ప్రశ్నించడంతో వైసీపీ కి అది షాక్ గా మారింది.  అంతే కాదు జగన్ కి తాను అధికారం కోల్పోతున్నాను అన్నది ముందే తెలిసిందా అందుకేనా వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరణ చేయలేదని మంత్రి సెటైర్లు పేల్చారు.



తప్పు వైసీపీ ప్రభుత్వం చేసిందని మంత్రి సూటిగానే చెప్పేశారు. మాకు వాలంటీర్ వ్యవస్థ మీద విశ్వాసం ఉంది అంటేనే ఆ వ్యవస్థ అయితే ఏపీలో ప్రస్తుతం లేదని తేల్చేశారు. దీనిని బట్టి వాలంటీర్లకు భారీ షాక్ ఇచ్చేసినట్లే అని అంటున్నారు.


లక్షన్నర మంది వాలంటీర్లను పది వేల నెలవారి గౌరవ వేతనంతో కొనసాగించడం తడిసి మోపెడు అవుతుంది. ప్రస్తుతం ఖజానాలో కూడా అంత సొమ్ము లేదని అంటున్నారు. అదే టైం లో వారిని రెగ్యులరైజ్ చేయలేదని వైసీపీ మీద భారీ బండను వేసింది. దాంతో వాలంటీర్లు ఇపుడు వైసీపీ మీద మండుతారా లేక కూటమి మీద ఆగ్రహిస్తారా అన్నది చూడాల్సి ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరింది బాసు .. 20 ఏళ్ల తర్వాత సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>