Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadevd15b5954-2819-45c8-9da9-e3de85d56831-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadevd15b5954-2819-45c8-9da9-e3de85d56831-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చాలా మంచి సినిమాలు తీస్తున్నా థియేటర్లలో మాత్రం అవి హిట్ కావడం లేదు. ఓటీటీ, టీవీల్లో ఈ హీరో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి కానీ సినిమాల్లో హిట్ కాకపోవడం వల్ల నిర్మాతలకు లాస్‌లు వస్తున్నాయి అందువల్ల ఈ హీరో ఎదుగు బొదులు లేకుండా ఉన్నచోటే ఉండి పోతున్నాడు. ఈ హీరో జీబ్రా సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆయన సినిమాకి చిరంజీవి మద్దతు ఓం ప్రకటించే ఆశ్చర్యపరిచారు. దీని గురించి సత్యదేవ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. Satyadev{#}Eshwar;Coronavirus;Yevaru;Chiranjeevi;Blockbuster hit;Hindi;Hero;Cinema;Eventఆ సినిమా హిట్ అయ్యుంటే.. నేను ఎక్కడో ఉండేవాడిని : సత్యదేవ్ఆ సినిమా హిట్ అయ్యుంటే.. నేను ఎక్కడో ఉండేవాడిని : సత్యదేవ్Satyadev{#}Eshwar;Coronavirus;Yevaru;Chiranjeevi;Blockbuster hit;Hindi;Hero;Cinema;EventThu, 21 Nov 2024 16:07:00 GMTటాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చాలా మంచి సినిమాలు తీస్తున్నా థియేటర్లలో మాత్రం అవి హిట్ కావడం లేదు. ఓటీటీ, టీవీల్లో ఈ హీరో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి కానీ సినిమాల్లో హిట్ కాకపోవడం వల్ల నిర్మాతలకు లాస్‌లు వస్తున్నాయి అందువల్ల ఈ హీరో ఎదుగు బొదులు లేకుండా ఉన్నచోటే ఉండి పోతున్నాడు. ఈ హీరో జీబ్రా సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆయన సినిమాకి చిరంజీవి మద్దతు ఓం ప్రకటించే ఆశ్చర్యపరిచారు. దీని గురించి సత్యదేవ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు.

"చిరంజీవి గారు నాకు శుభాకాంక్షలు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మద్దతు వల్ల మా సినిమా ‘జీబ్రా’కి చాలా హైప్ లభించింది. బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మద్దతు నాకు చాలా బలాన్ని ఇచ్చింది. ‘జీబ్రా’ సినిమా ప్రమాదాలు, అదృష్టం, మానవ స్వభావం గురించి ఉంటుంది. అదృష్టం మాకు కలిసి వస్తున్నట్లు అనిపిస్తుంది" అని నటుడు సత్యదేవ్‌ తెలిపారు.

"జీబ్రా" సినిమా పేరుకు చాలా అర్థం ఉందని నటుడు సత్యదేవ్‌ చెప్పారు. "జీబ్రా మీద నల్ల తెల్ల రంగులు ఉంటాయి కదా, అలాగే మా సినిమాలో డబ్బు వల్ల వచ్చే అక్రమాలు, మంచి చెడుల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన మా సినిమాలో మంచి చెడులు గుర్తించడం చాలా కష్టం. ఎవరు నిజంగా మంచి వాళ్ళో, ఎవరు చెడు వాళ్ళో చెప్పలేం" అని ఆయన వివరించారు.

సత్యదేవ్‌, ధనంజయ ఇద్దరూ ఈ సినిమా కోసం చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. ధనంజయ కూడా తన మంచి ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఇంత పెద్ద రిస్క్ తీసుకొని వచ్చిన మా సినిమా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని సత్యదేవ్‌ అన్నారు.

"నా సినిమా ‘బ్లఫ్‌మాస్టర్’ బాగా పేరు తెచ్చుకుంది. నిర్మాతలకు మాత్రం ఆ సినిమా ఎలాంటి లాభాలు తెచ్చి పెట్టలేదు. థియేటర్లో హిట్ కాకపోవడంతో నేను చాలా బాధపడ్డాను. కొన్ని సినిమాలు, స్టార్ ప్రొడ్యూసర్లు ఈ సినిమా చూసి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మొదట్లో ఇది ఫ్లాప్ అయినా, ఓటీటీలో మంచి విజయం సాధించాయి. అలాగే ‘ఉమామహేశ్వర’ కూడా కరోనా కారణంగా నష్టపోయింది. ఇవి హిట్ అయినట్లయితే నేను ఎక్కడో ఉండేవాణ్ణి." అని సత్యదేవ్‌ తన గత అనుభవాల గురించి చెప్పారు. ఇకపోతే జీబ్రా సినిమాలో సత్యదేవ్‌ ధనవంతుడిగా నటిస్తున్నాడు. ఆ తర్వాత అతని పాత్రలో ఒక ట్విస్ట్ వస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి వయసుకు కూతురు...అంతలోనే తల్లి ప్రెగ్నెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>