Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-276d70b60-2b47-4d11-a878-29c530d2afc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-276d70b60-2b47-4d11-a878-29c530d2afc3-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 "..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతం లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో రావు రమేష్ ,ఫహద్ ఫాజిల్ ,సునీల్ ,అనసూయ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.అలాగే ఈ సినిమాతో #pushpa 2{#}rao ramesh;college;Muthu;Capital;Event;Allu Arjun;rashmika mandanna;December;Audience;ram pothineni;Director;Blockbuster hit;Cinema;Indiaపుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..జరిగేది ఎప్పుడంటే..?పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..జరిగేది ఎప్పుడంటే..?#pushpa 2{#}rao ramesh;college;Muthu;Capital;Event;Allu Arjun;rashmika mandanna;December;Audience;ram pothineni;Director;Blockbuster hit;Cinema;IndiaThu, 21 Nov 2024 09:21:51 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 "..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతం లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో రావు రమేష్ ,ఫహద్ ఫాజిల్ ,సునీల్ ,అనసూయ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.అలాగే ఈ సినిమాతో అల్లు అర్జున్ కి భారీగా ఫాలోయింగ్ పెరిగింది..పుష్ప 2 తో అల్లు అర్జున్ రేంజ్ ఊహించని స్థాయికి చేరుతుందని మేకర్స్ ధీమాగా వున్నారు.గత మూడేళ్ళుగా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా రాలేదు.దీనితో పుష్ప 2 కోసం  ప్రేక్షకులు  ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న రిలీజ్ చేయనున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.బీహార్ రాజధాని పాట్నా లో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేసారు.చెన్నైలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్ పై "పుష్ప 2 " మూవీ టీం ప్రకటన విడుదల చేసింది.ఈ నెల 24 న తాంబరంలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో వున్నా లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.ఈ వైల్డ్ ఫైర్ ఈవెంట్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొంది.ఇక నుంచి సినిమా రిలీజ్ వరకు వరుస అప్డేట్స్ రానున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: నెట్ ఫ్లిక్స్ తో అన్ని కోట్లు బేరం కుదుర్చుకున్న నయనతార..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>