Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi88e600ca-ab37-4e86-8a01-87bd520ad4b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi88e600ca-ab37-4e86-8a01-87bd520ad4b9-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అగ్రతారలుగా కొనసాగుతూ నటనలో అందం అభినయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది సిని సెలబ్రిటీల జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని బాధాకరమైన ఘటనలు కూడా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న జాన్వి కపూర్ జీవితంలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన ఉంది. అదే తల్లి మరణం. హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వెండితెర జాబిల్లి అనే గుర్తింపు సంపాదించుకుంది శ్రీదేవి. ఇక పెళ్లి తjanvi{#}Janhvi Kapoor;Sridevi Kapoor;jahnavi;Indian;marriage;Cinemaతల్లి మరణంతో కుంగిపోయిన జాన్వి.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది?తల్లి మరణంతో కుంగిపోయిన జాన్వి.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది?janvi{#}Janhvi Kapoor;Sridevi Kapoor;jahnavi;Indian;marriage;CinemaTue, 19 Nov 2024 11:10:00 GMTసినిమా ఇండస్ట్రీలో అగ్రతారలుగా కొనసాగుతూ నటనలో అందం అభినయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది సిని సెలబ్రిటీల జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని బాధాకరమైన ఘటనలు కూడా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు  ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న జాన్వి కపూర్ జీవితంలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన ఉంది. అదే తల్లి మరణం. హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వెండితెర జాబిల్లి అనే గుర్తింపు సంపాదించుకుంది శ్రీదేవి. ఇక పెళ్లి తర్వాత ఏకంగా పిల్లల కోసం తన కెరీర్ ని త్యాగం చేసింది.


 అయితే శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి జాన్వి కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక జాన్వి మొదటి సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఏకంగా శ్రీదేవి కూతురి సినీ రంగ ప్రవేశం చూడకుండానే చివరికి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటివరకు తల్లి చాటు బిడ్డగా ఉన్న జాన్వి కపూర్..అన్ని విషయాల్లో తనకు అండగా నిలిచిన తల్లి లేదు అన్న విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. తల్లి మరణ వార్తతో జాన్వి గుండె బద్దలైంది. ఆ తర్వాత తాను తల్లి లేకుండా ఎలా ముందుకు వెళ్లాలి అనేది అర్థం కాక ఎంతగానో కృంగిపోయింది జాన్వి కపూర్. అయితే తన తల్లి శ్రీదేవి చివరి క్షణాల్లో తల్లి పక్కనే లేకపోవడం.. జాహ్నవి కపూర్ ని మరింతగా బాధించింది.


 అయితే చిన్నప్పటి నుంచి శ్రీదేవి తన కూతుర్లు  జాన్వి, ఖుషిలతో ఏకంగా తల్లిలా కాకుండా ఏకంగా స్నేహితురాలు లాగానే ఉండేది. ప్రతి విషయాన్ని తనతో షేర్ చేసుకోవాలని చెబుతూ ఉండేదట. అంతేకాకుండా ఇక ఇలా శ్రీదేవి కూతుర్లు అనే ట్యాగ్ తో ఇండస్ట్రీకి పరిచయమైతే ఎదురయ్యే సవాళ్లు.. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై కూడా సూచనలు ఇస్తూ ఉండేదట శ్రీదేవి. ఇలా ప్రతి విషయంలో వెన్నంటే ఉన్న తల్లి హఠాత్మరణంతో అటు జాన్వి కపూర్ ఖుషి కపూర్ లు శోక సంద్రంలో మునిగిపోయారట. శ్రీదేవి మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లికి హాజరైన సమయంలో ఇక ఈ విషాదకర ఘటన జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇలా జాన్వి కపూర్ జీవితంలో తల్లి హఠాత్ మరణం ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషాద గాధలా మిగిలిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>