Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kapil4f5facee-aa95-4b96-979b-ab0a5475c6ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kapil4f5facee-aa95-4b96-979b-ab0a5475c6ed-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్, ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధాజ్ఞలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్ద కాలానికి పైగానే ఈ నిషేధం కొనసాగుతూ ఉంది. అయితే ఈ బ్యాన్ కారణంగా భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లదు. పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు రాదు. ఇలా ఇరు జట్లు కూడా మ్యాచ్ ఆడాలంటే కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి పెద్ద టోర్నమెంట్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నాయ్. గతంలో ఆసియా కప్ కూడా పాకిస్తాన్ లో జరగగా టీమిండియా.. అటు పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీkapil{#}Cricket;Government;media;Pakistan;Indiaపాక్ కు టీమిండియా వెళ్లాలా వద్దా.. కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్?పాక్ కు టీమిండియా వెళ్లాలా వద్దా.. కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్?kapil{#}Cricket;Government;media;Pakistan;IndiaMon, 18 Nov 2024 15:00:00 GMTపాకిస్తాన్, ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధాజ్ఞలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్ద కాలానికి పైగానే ఈ నిషేధం కొనసాగుతూ ఉంది. అయితే ఈ బ్యాన్ కారణంగా భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లదు. పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు రాదు. ఇలా ఇరు జట్లు కూడా మ్యాచ్ ఆడాలంటే కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి పెద్ద టోర్నమెంట్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నాయ్. గతంలో ఆసియా కప్ కూడా పాకిస్తాన్ లో జరగగా టీమిండియా.. అటు పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించింది.


 దీంతో భారత జట్టు కోసం పాకిస్థాన్ లో జరగాల్సిన మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో మరోచోట నిర్వహించడంతో భారత్ ఆసియా కప్ లో పాల్గొని మ్యాచ్లు ఆడింది. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ అటు ఐసిసి టోర్నీ అయినా ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం ఇవ్వబోతుంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అటు భారత్, పాకిస్తాన్ వెళ్లడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు వెళ్లే అవకాశం లేదు అంటూ ఇప్పటికే టీమ్ ఇండియా తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే హైబ్రిడ్ పద్ధతిలో తాము ఆడే మ్యాచ్లను నిర్వహించాలి అంటూ స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురయింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్తాన్ కు పంపవద్దని కేంద్రం దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ కపిల్ దేవ్ ను మీడియా ప్రశ్నించింది. ఇక దీనిపై ఆయన ఆసక్తికర సమాధానం చెప్పాడు. నన్ను ఈ ప్రశ్న అడగడం కరెక్ట్ కాదు. దీనిపై మనలాంటి వాళ్ళు అభిప్రాయం కూడా చెప్పవద్దు. పూర్తిస్థాయి నిర్ణయం తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదే. ఫైనల్ గా ప్రభుత్వం ఏది డిసైడ్ చేస్తే.. ఇక అదే చివరి నిర్ణయం అవుతుంది అంటూ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>