MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vignesh-shivan73d65bfe-d862-49e7-904b-394fe5fb932d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vignesh-shivan73d65bfe-d862-49e7-904b-394fe5fb932d-415x250-IndiaHerald.jpgతెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఆసక్తిని చూపించింది. ఇక ఈమె ఏక కాలంలో అటు తమిళ్ , ఇటు తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు "నయనతార: బియాండ్‌ ద ఫేరీ టేల్‌" అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ లో భాగంగా నానుమ్‌ రౌVignesh shivan{#}NET FLIX;raja;dhanush;producer;Producer;Darsakudu;nayantara;Tollywood;Tamil;Telugu;Husband;Wife;media;Director;Cinemaఫ్రీగా ప్రేక్షకుల ముందుకు పది కోట్ల విలువైన వీడియో.. పెద్ద రిస్క్ చేసిన ప్రొడ్యూసర్..?ఫ్రీగా ప్రేక్షకుల ముందుకు పది కోట్ల విలువైన వీడియో.. పెద్ద రిస్క్ చేసిన ప్రొడ్యూసర్..?Vignesh shivan{#}NET FLIX;raja;dhanush;producer;Producer;Darsakudu;nayantara;Tollywood;Tamil;Telugu;Husband;Wife;media;Director;CinemaMon, 18 Nov 2024 13:45:00 GMTతెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఆసక్తిని చూపించింది. ఇక ఈమె ఏక కాలంలో అటు తమిళ్ , ఇటు తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు "నయనతార: బియాండ్‌ ద ఫేరీ టేల్‌" అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ను రూపొందించారు.

ఈ వెబ్ సిరీస్ లో భాగంగా నానుమ్‌ రౌడీ దాన్‌ అనే సినిమాలో చిత్రీకరించిన మూడు సెకండ్ల నిడివి గల ఓ చిన్న సిన్ ను వాడుకున్నారు. దీనితో ఈ సినిమా నిర్మాత అయినటువంటి ధనుష్ నా సినిమా నుండి సన్నివేశాన్ని వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని విమర్శిస్తూ నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. ఇక నయనతార పోస్టుకు సపోర్ట్ చేస్తూ ఆమె భర్త అయినటువంటి విగ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా రెండు పోస్టులను చేశారు. అందులో ఒక దాంట్లో కేవలం మూడు సెకండ్ల నిడివి గల వీడియోను వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇక ఆ వీడియోను ఫ్రీ గా చూసేయండి అంటూ ఇన్ స్టా స్టోరీలో ఒక వీడియోను షేర్ చేశాడు. 

ఇక అంతటితో మాత్రమే ఆగకుండా ఆయన మరో పోస్ట్ లో 2017 వ సంవత్సరంలో సక్క పొడు పొడు రాజా ఆడియో ఫంక్షన్ లో ధనుష్ మాట్లాడిన ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో ధనుష్ ప్రేమను పంచడం గురించి , నటీనటులతో పని చేసే చోట ఉండాల్సిన వాతావరణం గురించి మాట్లాడాడు. ఇక ఈ వీడియోను కూడా విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇలా తన భార్య అయినటువంటి నయనతారకు సపోర్ట్ చేస్తూ నటుడు , దర్శకుడు , నిర్మాత అయినటువంటి విగ్నేష్ శివన్ రెండు పోస్టులు చేశాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిజంగా ఈయన సుకుమారేనా.. స్టార్ డైరెక్టర్ లో ఇంత మార్పా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>