Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun80d9c342-3eff-4ca0-8af5-07440a071a48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun80d9c342-3eff-4ca0-8af5-07440a071a48-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తన దర్శకత్వ ప్రతిభతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులందరికీ హృదయలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు ఇక సినిమా విషయంలో ఆయన కాలిక్యులేషన్స్ చూసి టాలీవుడ్ లెక్కల మాస్టర్ అని ప్రేక్షకులు అందరూ ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశారు అన్న విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుకుమార్ ట్రెండుకు తగ్గట్లుగా సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఉంటాడు. అయితే కొన్ని కొన్ని సార్లు సుకుమార్ తalluarjun{#}Master;December;sukumar;Tollywood;Audience;Allu Arjun;Cinema;India;Teluguనిజంగా ఈయన సుకుమారేనా.. స్టార్ డైరెక్టర్ లో ఇంత మార్పా?నిజంగా ఈయన సుకుమారేనా.. స్టార్ డైరెక్టర్ లో ఇంత మార్పా?alluarjun{#}Master;December;sukumar;Tollywood;Audience;Allu Arjun;Cinema;India;TeluguMon, 18 Nov 2024 14:47:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తన దర్శకత్వ ప్రతిభతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులందరికీ హృదయలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు ఇక సినిమా విషయంలో ఆయన కాలిక్యులేషన్స్ చూసి టాలీవుడ్ లెక్కల మాస్టర్ అని ప్రేక్షకులు అందరూ ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశారు అన్న విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుకుమార్ ట్రెండుకు తగ్గట్లుగా సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఉంటాడు.


 అయితే కొన్ని కొన్ని సార్లు సుకుమార్ తీసే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో క్యాలిక్యులేషన్స్ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ దర్శకుడిగా మారిపోయాడు అల్లు అర్జున్ తో తీసిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ రేంజ్ ఒకసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన పుష్ప-2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. కాగా ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేయగా బీభత్సమైన స్పందన వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సుకుమార్ డైరెక్షన్ మొదలు పెట్టిన నాటి నుంచి కూడా ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా ఎప్పుడు ఆలస్యం జరుగుతూనే ఉంటుంది స్క్రిప్టులు చేంజ్ చేయడం.. తనకు నచ్చినట్లుగా సీన్స్ వచ్చేవరకు కూడా ఆగుతూనే ఉంటాడు. అందుకే ఎప్పుడు  ముందు అనుకున్న రిలీజ్ డేట్ కి సినిమా రిలీజ్ అవ్వదు. పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది.



 పుష్ప-2 సినిమా కూడా ఇలాగే రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి కొన్ని నెలల ముందు డిసెంబర్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికి అభిమానుల్లో అనుమానమే. అనుకున్న తేదీ వరకు సుకుమార్ సినిమాను పూర్తి చేయగలడా అనే అనుమానం. కానీ ఏకంగా మూడు యూనిట్స్ తో సుకుమార్ సినిమాను పూర్తి చేశాడట. కొన్ని చోట్ల తానే చార్జి తీసుకుంటే ఇంకొన్ని చోట్ల తన పర్యవేక్షణలోనే అసిస్టెంట్లతో సీన్లను కంప్లీట్ చేశాడట. ఇక అంతేకాదు రెయిన్ బవలు కష్టపడుతూ ఒకవైపు ఎడిటింగ్ బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడట. ఇలా సూపర్ స్పీడ్ తో షూట్ కంప్లీట్ చేయడమే కాదు సినిమా విడుదలకు 10 రోజుల ముందు సెన్సార్ కట్ కూడా పూర్తి చేయబోతున్నాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఎప్పుడు ఆలస్యం చేసే సుకుమారేనా ఇలా మారిపోయింది. ఆ సుకుమార్సుకుమార్ ఒక్కరేనా అని అందరూ చర్చించుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>