EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy66418da4-b0bb-453e-9063-aa2bfe56a07b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy66418da4-b0bb-453e-9063-aa2bfe56a07b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది కావస్తోంది. సీఎం రేవంత్రెడ్డి సీఎంగా మరో 11 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పడింది. కేబినెట్లో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిగా భర్తీకి నోచుకోవడం లేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత భర్తీ చేస్తారని ప్రచారం జరిగినా ఆషాఢ మాసం అడ్డు వచ్చింది. తర్వాత శ్రావణంలో భర్తీ చేస్తారని కొందరి పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయినా చడీ చప్పుడు లేదు. ఇక ఏడాది పాలన పూర్తికావొస్తున్న తాజా పరిస్థితిలో సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్లrevanth reddy{#}TPCC;Parliament;Delhi;Elections;Party;CM;Governmentఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ? మంత్రులుగా ఎవరెవరు అంటే..?ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ? మంత్రులుగా ఎవరెవరు అంటే..?revanth reddy{#}TPCC;Parliament;Delhi;Elections;Party;CM;GovernmentSun, 17 Nov 2024 13:37:00 GMTతెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది కావస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సీఎంగా మరో 11 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పడింది. కేబినెట్‌లో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిగా భర్తీకి నోచుకోవడం లేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత భర్తీ చేస్తారని ప్రచారం జరిగినా ఆషాఢ మాసం అడ్డు వచ్చింది. తర్వాత శ్రావణంలో భర్తీ చేస్తారని కొందరి పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయినా చడీ చప్పుడు లేదు. ఇక ఏడాది పాలన పూర్తికావొస్తున్న తాజా పరిస్థితిలో సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈమేరకు ఏఐసీసీ, సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల నుంచి కేబినెట్‌లో ఆరు పోస్టుల భర్తీపై చర్చలు జరుగుతున్నాయి. నాటి నుంచే ఆశావహులు నిరీక్షిస్తున్నారు.


ఇదిలా ఉంటే.. కేబినెటuЇలో మిగిలిన ఆరు స్థానాల కోసం అనేక మంది ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ఏడాదిలో 24 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పలువురి పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఆశావహులు కూడా ఢిల్లీ స్థాయిలో సొంతంగా లాబీయింగ్‌ చేశారు. కొందరికి అధిష్టానం నుంచి హామీ కూడా వచ్చిందని ప్రచారం కూడా జరిగింది. టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించిన సమయంలోనూ మంత్రదివర్గ విస్తరణపై చర్చ జరిగింది. కానీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. దీంతో 11 నెలలుగా ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు.


ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎంపికయ్యారు. నవంబర్‌ 20న ఎన్నికలు జరుగనున్నాయి. 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత తెలంగాణలో క్యాబినెట్‌ విస్తరణకు అధిష్టానం నుంచి అనుమతి వస్తుందని తెలిసింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నపూర్ణ స్టూడియో స్థాపించిన నాగేశ్వరరావుని స్టూడియోలోకి వెళ్లకుండా ఆరోజు ఎందుకు ఆపారు .. అసలేం జరిగింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>