Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar-ajay-devgan-bollywood-movie-plancff10e4c-1471-490f-83da-af92ff5db1b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar-ajay-devgan-bollywood-movie-plancff10e4c-1471-490f-83da-af92ff5db1b2-415x250-IndiaHerald.jpgఅజయ్ దేవగన్ ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2024లో మాట్లాడుతూ తానే ఓ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నానని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారని తెలిపారు. బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి పనిచేస్తున్నారన్న విషయం తెలిసే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.Ajay Devgan{#}Rohit Shetty;Deepika Padukone;Kareena Kapoor;Kartik Aaryan;Ajay Devgn;vedhika;ajay;Akshay Kumar;Cinemaక్రేజీ న్యూస్: స్టార్ హీరో డైరెక్షన్‌లో నటించబోతున్న మరో స్టార్ హీరో?క్రేజీ న్యూస్: స్టార్ హీరో డైరెక్షన్‌లో నటించబోతున్న మరో స్టార్ హీరో?Ajay Devgan{#}Rohit Shetty;Deepika Padukone;Kareena Kapoor;Kartik Aaryan;Ajay Devgn;vedhika;ajay;Akshay Kumar;CinemaSun, 17 Nov 2024 17:56:00 GMTఈ రోజుల్లో సినిమా వాళ్లు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. తద్వారా ప్రేక్షకులకు క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్ఆర్ సినిమా ఫేమ్ అజయ్ దేవగన్ ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2024లో మాట్లాడుతూ తానే ఓ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నానని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారని తెలిపారు. బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి పనిచేస్తున్నారన్న విషయం తెలిసే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ, "ఈ విషయాన్ని తర్వాత ప్రకటించాలనుకున్నాం కానీ, ఈ వేదిక దీనికి అనువైనదిగా భావిస్తున్నాను. మేము ఇప్పటికే కలిసి ఒక చిత్రంపై పని చేస్తున్నాము. నేను దర్శకత్వం వహిస్తున్నాను, అక్షయ్ నటిస్తున్నాడు" అని తెలిపారు.

సినిమా గురించి మరిన్ని వివరాలు అడిగినప్పుడు, అక్షయ్ కుమార్ తనదైన శైలిలో జోక్ చేస్తూ, "స్క్రిప్ట్ నేను నీకు పంపించేయనా?" అని అడిగారు. దీనికి అజయ్ దేవగన్ నవ్వుతూ, "ఇంకా అంత తొందరగా ఏమీ చెప్పలేం. సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం" అని సమాధానం ఇచ్చారు.

అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. 1994లో వచ్చిన 'సుహాగ్' సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా, 'ఖాకీ', 'ఇన్సాన్' వంటి సినిమాల్లో కూడా వీళ్లిద్దరూ కలిసి నటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'సూర్యవంశి' చిత్రంలో కూడా వీళ్లిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న ఈ కొత్త సినిమా ప్రేక్షకులకు మరో వినోదం అందించబోతుందని అంచనా.

అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ కలిసి చివరగా ‘సింగం అగైన్’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్, టైగర్ శ్రాఫ్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె వంటి స్టార్స్‌ నటించారు. ఈ సినిమా దీపావళికి విడుదలై, కార్తిక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్య 3’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. అజయ్ మరియు, కలిసి నటిస్తున్న కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కానీ, ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి ఉండాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ గురించి.. ఈ విషయం మీకు తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>