MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/movies20d827c8-4b87-4018-830e-8e0402ca488e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/movies20d827c8-4b87-4018-830e-8e0402ca488e-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉండడమే. ఇక వచ్చే సంవత్సరం కూడా అనేక సినిమాలు సంక్రాంతి పండుగకు రిలీజ్ కావడానికి రెడీ అయ్యాయి. వచ్చే సంవత్సరం అన్ని సినిమాల కంటే ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత నందమూరి నట సింహMovies{#}anil ravipudi;festival;Pawan Kalyan;sundeep kishan;GEUM;Venkatesh;lion;Makar Sakranti;January;Tollywood;Cinemaసంక్రాంతి 2025 : ఓన్లీ త్రీ మూవీస్ గురు.. వేరే వాటికి ఛాన్స్ లేదా..?సంక్రాంతి 2025 : ఓన్లీ త్రీ మూవీస్ గురు.. వేరే వాటికి ఛాన్స్ లేదా..?Movies{#}anil ravipudi;festival;Pawan Kalyan;sundeep kishan;GEUM;Venkatesh;lion;Makar Sakranti;January;Tollywood;CinemaSun, 17 Nov 2024 13:57:00 GMTసంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉండడమే. ఇక వచ్చే సంవత్సరం కూడా అనేక సినిమాలు సంక్రాంతి పండుగకు రిలీజ్ కావడానికి రెడీ అయ్యాయి. వచ్చే సంవత్సరం అన్ని సినిమాల కంటే ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూడు సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలబడడానికి రెడీగా ఉన్నాయి. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న మజాకా మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు సంబంధించి పెద్దగా అప్డేట్లను ఏమి విడుదల చేయలేదు.

మరి వచ్చే సంవత్సరం సంక్రాంతికి గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే థియేటర్లు ఆల్మోస్ట్ వెళ్లిపోనున్నట్లు , మరో సినిమా వస్తే దానికి థియేటర్లు దొరకడం అత్యంత కష్టం అయ్యే అవకాశం ఉంది అని , దానితో మరో సినిమా విడుదల చేసిన పెద్దగా ప్రతిఫలం ఉండదు అనే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. మరి ఇంత గట్టి పోటీలో సందీప్ కిషన్ "మజాకా" మూవీ తో సంక్రాంతి బరిలో ఉంటాడా ..? లేదా అనేది చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తూచ్..పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో శ్రీలీల మాత్రమే కాదు ఆ హీరోయిన్లు కూడా..సుకుమార్ స్వీట్ సర్ ప్రైజ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>