Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kuberaaaadff3e-5c33-435e-b481-192e5596fac6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kuberaaaadff3e-5c33-435e-b481-192e5596fac6-415x250-IndiaHerald.jpgసాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు అంటే నాచురాలిటీ కి దగ్గరగా ఉంటాయి. ఏకంగా మన జీవితంలోని ఎన్నో సన్నివేశాలు శేఖర్ కమ్ముల సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆయన సినిమాలను ఫీల్ గుడ్ మూవీస్ అని చెబుతూ ఉంటారు. ఆయన సినిమాల్లో పెద్దపెద్ద హీరోలు కూడా కనిపించడం చాలా అరుదు. అలాంటిది మొదటిసారి శేఖర్ కమ్ముల.. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఏకంగా ధనుష్ నాగార్జున రష్మిక మందన్న లాంటి ప్రస్తుత అగ్రతాలను ప్రధానోపాత్రల్లో పెట్టి కుబేర అనే మూవీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. దీంతో ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే kubera{#}Akkineni Nagarjuna;dhanush;rashmika mandanna;sekhar;Traffic police;Cinemaకుబేర గ్లింప్స్.. బిచ్చగాడిలా ధనుష్.. సినిమా స్టోరీ ఇదేనా?కుబేర గ్లింప్స్.. బిచ్చగాడిలా ధనుష్.. సినిమా స్టోరీ ఇదేనా?kubera{#}Akkineni Nagarjuna;dhanush;rashmika mandanna;sekhar;Traffic police;CinemaSat, 16 Nov 2024 14:45:00 GMTసాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు అంటే నాచురాలిటీ కి దగ్గరగా ఉంటాయి. ఏకంగా మన జీవితంలోని ఎన్నో సన్నివేశాలు శేఖర్ కమ్ముల సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆయన సినిమాలను ఫీల్ గుడ్ మూవీస్ అని చెబుతూ ఉంటారు. ఆయన సినిమాల్లో పెద్దపెద్ద హీరోలు కూడా కనిపించడం చాలా అరుదు. అలాంటిది మొదటిసారి శేఖర్ కమ్ముల.. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఏకంగా ధనుష్ నాగార్జున రష్మిక మందన్న లాంటి ప్రస్తుత అగ్రతాలను ప్రధానోపాత్రల్లో పెట్టి కుబేర అనే మూవీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. దీంతో ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే విషయంపై అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే ఇటీవలే కుబేర సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇక ఈ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత చూస్తే ఈ మూవీలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తోంది. ఇక ఇది చూసి మళ్లీ శేఖర్ కమ్ములకు హిట్టు గ్యారంటీ అని అంటున్నారు. ధనుష్ బిచ్చగాడిలా నాగార్జున పోలీస్ ఆఫీసర్గా రష్మిక పల్లెటూరు అమ్మాయిల కనిపిస్తోంది. దీంతో ఇక కుబేర కథ ఇదే అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ధనుష్ డబ్బు కొట్టేసి ఆ డబ్బు కాపాడుకోవడం కోసం బిచ్చగాడు అవుతారం ఎత్తుతాడు. ఇక ధనుష్ ను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ నాగార్జున వెతుకుతుంటాడు. ఇక ఇలా ఆసక్తిగా సినిమా సాగుతున్న సమయంలోనే ఇక కథను మలుపు తిప్పే పాత్రలో రష్మిక కనిపిస్తుంది. రష్మిక పాత్ర ఏంటి? ధనుష్ డబ్బు ఎవరి నుంచి కొట్టేశాడు అన్నదే ఈ సినిమాలోని ముఖ్య సారాంశంగా ఉంటుందట. ఇక ఈ కథలో ఎన్నో ట్విస్టులు కూడా ఉంటాయి అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరో ధనుష్.. నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నయనతార..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>