EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuca403a37-2f18-4bd4-b8f8-db14d3f8a023-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuca403a37-2f18-4bd4-b8f8-db14d3f8a023-415x250-IndiaHerald.jpgపిల్లలను కనండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం పిల్లలను కనమన్నది ఒక స్లోగన్ గా మారుతోంది. రష్యా లాంటి దేశాలు అయితె ఏకంగా శృంగార మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి పిల్లాలను కనమని చెబుతున్నాయి. అందుకు గానూ వారికి తగిన ఆర్ధిక ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నాయి. చైనా జపాన్ ఇతర దేశాలూ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇక భారత దేశంలో చూస్తే దక్షిణాదిన జనాభా తగ్గిపోతోంది. దాంతో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో దూరదృష్టితో చంద్రబాబు వంటి వారు chandrababu{#}Japan;Yuva;Russia;local language;Population;Andhra Pradesh;Telangana Chief Minister;CBNపిల్లల్ని కనమంటున్న బాబు? మరి పెంచడం ఎలా?పిల్లల్ని కనమంటున్న బాబు? మరి పెంచడం ఎలా?chandrababu{#}Japan;Yuva;Russia;local language;Population;Andhra Pradesh;Telangana Chief Minister;CBNSat, 16 Nov 2024 14:58:00 GMTపిల్లలను కనండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం పిల్లలను కనమన్నది ఒక స్లోగన్ గా మారుతోంది. రష్యా లాంటి దేశాలు అయితె ఏకంగా శృంగార మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి పిల్లాలను కనమని చెబుతున్నాయి. అందుకు గానూ వారికి తగిన ఆర్ధిక ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నాయి. చైనా జపాన్ ఇతర దేశాలూ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇక భారత దేశంలో చూస్తే దక్షిణాదిన జనాభా తగ్గిపోతోంది. దాంతో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.


ఈ విషయంలో దూరదృష్టితో చంద్రబాబు వంటి వారు చెబుతున్న విషయాలు బాగానే ఉంటున్నాయి. జీవన ప్రమాణాలు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దాంతో వృద్ద్ధ జనాభా కొన్నాళ్ళ నాటికి తయారవుతుందని యువ జనాభా వనరులు తగ్గిపోతాయని అంటున్నారు. దీని మీదనే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ పిల్లలను కనండి అని అంటున్నారు.  పంచాయతీలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లాల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయరాదు అన్న నిబంధనలను చంద్రబాబు తొలగించారు.


ఎక్కువ పిల్లలు ఉంటే అదే భాగ్యం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఆర్ధిక సమస్యలు బాగా ఎక్కువైన వర్తమానంలో చిన్న సంసారమే చింతలతో ఉంటే అధిక సంతానంతో వేగేది ఎలా అని జనాలు అంటున్నారు. ఈ రోజున కాన్వెంట్ కి వెళ్లే పిల్లలకు సైతం లక్షలలో ఫీజులు అవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది.


ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి సాకేందుకు చూసుకునేందుకు కూడా వీలు ఉండదని అంటున్నారు. ఆర్ధికంగా అనేక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఇతర దేశాలలో ఈ నినాదాలు పాలకులు ఇస్తూ దానికి అనుగుణంగా ఆర్ధిక ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు ఏపీలో కూడా ఆర్ధికంగా చేయూతను ఇస్తామని వారికి అండగా ఉంటామని చెబుతూ కొత్త పధకాలను కనుక ప్రకటిస్తే మాత్రం చంద్రబాబు అనుకున్నట్లుగా ఏపీ కూడా జనాభాంధ్రప్రదేశ్ గా మారడం కష్టం కాదని అంటున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరో ధనుష్.. నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నయనతార..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>