Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman650a9e03-956f-4416-a5e6-846841da1767-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaman650a9e03-956f-4416-a5e6-846841da1767-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు వరుసగా సూపర్ హిట్ లు సాధిస్తున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేసిన బాలకృష్ణ ఇక ఇప్పుడు డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి పోటీపడిన బాలయ్య ఇక ఇప్పుడు చిరు తనయుడు చరన్ నటించిన గేమ్ చేంజర్ సినిమాతో పోటీ పడడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదthaman{#}thaman s;producer;Producer;GEUM;Makar Sakranti;Balakrishna;Director;Chiranjeevi;Music;Cinemaవాళ్లు తమన్ పై కేసు వేస్తారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?వాళ్లు తమన్ పై కేసు వేస్తారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?thaman{#}thaman s;producer;Producer;GEUM;Makar Sakranti;Balakrishna;Director;Chiranjeevi;Music;CinemaSat, 16 Nov 2024 10:14:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు వరుసగా సూపర్ హిట్ లు సాధిస్తున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేసిన బాలకృష్ణ ఇక ఇప్పుడు డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి పోటీపడిన బాలయ్య ఇక ఇప్పుడు చిరు తనయుడు చరన్ నటించిన గేమ్ చేంజర్ సినిమాతో పోటీ పడడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.


 ఇక ఈ సినిమాకు పెట్టిన డాకు మహారాజ్ అనే టైటిల్ అయితే మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలయ్యను మ్యూజిక్ తో ఎలా ఎలివేట్ చేసి చూపించాలో తమన్ కు బాగా తెలుసు. ఇప్పటికే తమన్ బాలయ్య సినిమాలకు పనిచేసి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఇప్పుడు మరోసారి తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవల టీజర్ లంచ్ కార్యక్రమంలో తమన్ మ్యూజిక్ గురించి డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టీజర్ గురించి మాట్లాడుతూ.. టీజర్ లో చూపించిన దాంట్లో ఎక్కడ డూప్ లేదు. గుర్రం ఎక్కింది బాలకృష్ణనే నడిపింది కూడా ఆయనే. యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. ఒరిజినల్ బాలయ్య. ఇక తమన్ సంగీతం గురించి మాట్లాడుతూ.. తమన్ ఎప్పటిలాగానే మంచి సంగీతం అందించారు  బాలకృష్ణ అభిమానులు ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి సినిమా మాస్ మూవీ. మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ చూస్తే స్పీకర్స్ ఓనర్స్ నామీద, తమన్ మీద కేసు వేస్తారేమో అనిపిస్తుంది అంటూ డైరెక్టర్ బాబి, నిర్మాత నాగ వంశి చెప్పుకొచ్చారు  మా మీద నమ్మకం ఉంచి బాలయ్య ఇక ఈ సినిమాను చేస్తున్నారు అంటూ తెలిపారు. అయితే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు మూవీ టీమ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాళ్లు తమన్ పై కేసు వేస్తారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>