MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kasthuri-621e24b2-bf09-4a0a-85ff-5f886b99670c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kasthuri-621e24b2-bf09-4a0a-85ff-5f886b99670c-415x250-IndiaHerald.jpgతమిళ నటి కస్తూరి ఎట్టకేలకు దొరికిపోయారు. గత వారం రోజుల నుంచి.. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న... నటి కస్తూరి తాజాగా అరెస్టు అయ్యారు. హైదరాబాద్ మహానగరంలో నటి కస్తూరి అరెస్టు కావడం జరిగింది. గచ్చిబౌలిలో... ఉంటున్న నటి కస్తూరిని చెన్నై పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. గత వారం రోజులుగా.. తమిళనాడు రాష్ట్రం నుంచి తప్పించుకొని హైదరాబాద్ కు వచ్చింది నటి కస్తూరి. kasthuri {#}Chennai;Tamilnadu;kasthuri;Hyderabad;Telugu;police;mediaహైదరాబాద్ హోటల్ లో దొరికిపోయిన నటి కస్తూరి ?హైదరాబాద్ హోటల్ లో దొరికిపోయిన నటి కస్తూరి ?kasthuri {#}Chennai;Tamilnadu;kasthuri;Hyderabad;Telugu;police;mediaSat, 16 Nov 2024 20:48:00 GMTతమిళ నటి కస్తూరి ఎట్టకేలకు దొరికిపోయారు. గత వారం రోజుల నుంచి.. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న... నటి కస్తూరి తాజాగా అరెస్టు అయ్యారు. హైదరాబాద్ మహానగరంలో నటి కస్తూరి అరెస్టు కావడం జరిగింది. గచ్చిబౌలిలో... ఉంటున్న నటి కస్తూరిని చెన్నై పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. గత వారం రోజులుగా.. తమిళనాడు రాష్ట్రం నుంచి తప్పించుకొని హైదరాబాద్ కు వచ్చింది నటి కస్తూరి.


తనను అరెస్టు చేయకుండా కోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయితే తాజాగా హైదరాబాదు లో పోలీసులకు చిక్కింది నటి కస్తూరి. ఇటీవల కాలంలోనే తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది తమిళనాడు నటి కస్తూరి. తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడిన తెలుగువారిని ఉద్దేశించి చాలా... దారుణంగా మాట్లాడింది.  అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో.. తమిళనాడు లో ఉన్న తెలుగు వారందరూ పోలీసుల కు ఫిర్యాదులు... చేశారు.


దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వారం రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నారు. నటి కస్తూరి ఇంటికి వెళ్తే...  ఆమె ఇంటికి తాళాలు వేసిన దృశ్యం కనిపించింది.  అంతేకాదు నటి కస్తూరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుని చెన్నై నుంచి పారిపోయింది. మొదట బెంగళూరుకు వెళ్లి అక్కడ మూడు రోజులు ఉందట. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం.

అయితే హైదరాబాద్ కు నటి కస్తూరి వచ్చినట్లు తమిళనాడు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు వచ్చాయట. దీంతో వెంటనే రంగంలోకి దిగి హైదరాబాదులోని గచ్చిబౌలిలో.. ఆమెను అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. ఇక హైదరాబాద్ పోలీసుల పర్మిషన్ తీసుకున్న తర్వాత చెన్నైకి ఆమెను తరలించనున్నారు. ఇక చెన్నైకి వెళ్ళిన తర్వాత... కోర్టులో... నటి కస్తూరిని హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నీ ముఖం నాకు చూపించకు అంటూ ఆ స్టార్ నటుడిపై కోప్పడిన ఎన్టీఆర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>