MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pooja-hegde711d92af-56c6-4aa1-85bf-ad7b6262bfa1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pooja-hegde711d92af-56c6-4aa1-85bf-ad7b6262bfa1-415x250-IndiaHerald.jpgపూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించింది. సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సరసన హీరోయిన్గా చేసి వరుస సినిమాల్లో నటించింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. pooja hegde{#}shyam;Darsakudu;Rangasthalam;Ram Gopal Varma;Pooja Hegde;varun tej;Director;Prabhas;Naga Chaitanya;Success;Allu Arjun;BEAUTY;Heroine;Tollywood;Cinema;Newsకష్టాల్లో పూజా హెగ్డే...రంగంలోకి అక్కినేని ఫ్యామిలీ ?కష్టాల్లో పూజా హెగ్డే...రంగంలోకి అక్కినేని ఫ్యామిలీ ?pooja hegde{#}shyam;Darsakudu;Rangasthalam;Ram Gopal Varma;Pooja Hegde;varun tej;Director;Prabhas;Naga Chaitanya;Success;Allu Arjun;BEAUTY;Heroine;Tollywood;Cinema;NewsSat, 16 Nov 2024 12:29:00 GMTపూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించింది. సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సరసన హీరోయిన్గా చేసి వరుస సినిమాల్లో నటించింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు.


2014లో విడుదలైన "ఒక లైలా కోసం" సినిమా తో ప్రేక్షకుల ముందుకు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరసగా సినిమా అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్ తో కలిసి రెండు సినిమాలు చేసింది. వరుణ్ తేజ్ తో కలిసి ఒక సినిమాలో నటించింది. అనంతరం రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ప్రభాస్ తో రాదే శ్యామ్ వంటి సినిమాలు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత పూజాకు తెలుగులో సినిమా ఆఫర్లు రావడం మానేశాయి. ఈ క్రమంలోనే పూజ హెగ్డేకు అక్కినేని నాగచైతన్య ఓ సినిమాలో నటించడానికి చాన్స్ ఇచ్చారట. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని సమాచారం అందుతోంది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించనున్న ఓ సూపర్ నాచురల్ త్రిల్లర్ సినిమాలో నాగచైతన్య హీరోగా చేయడానికి సిద్ధమవుతున్నారట.


ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేను తీసుకోవాలని నాగచైతన్య ఆసక్తి చూపిస్తున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ పూజ హెగ్డే కు మంచి గుర్తింపు లభించింది. మరి వీరిద్దరూ కలిసి చేయబోయే ఈ సినిమాతోనైనా పూజ హెగ్డేకు మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తాయా లేదా అనేది చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>