MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/satyadev63d5e989-4eb6-4c21-b7a7-2f58173af9d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/satyadev63d5e989-4eb6-4c21-b7a7-2f58173af9d0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో సత్యదేవ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన చార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన జ్యోతిలక్ష్మి అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం వల్ల ఈ నటుడికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత నుండి ఈయన ఎక్కువ శాతం సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం సత్యదేవ్ , మెగాస్టార్ చిరంజSatyadev{#}God Father;Eshwar;puri jagannadh;Industry;Chiranjeevi;Telugu;Hero;November;News;Cinemaఅన్ని కోట్లకి అమ్ముడుపోయిన జీబ్రా ఓటీటీ రైట్స్.. చిన్న సినిమాకి అంతా రేటా..?అన్ని కోట్లకి అమ్ముడుపోయిన జీబ్రా ఓటీటీ రైట్స్.. చిన్న సినిమాకి అంతా రేటా..?Satyadev{#}God Father;Eshwar;puri jagannadh;Industry;Chiranjeevi;Telugu;Hero;November;News;CinemaSat, 16 Nov 2024 09:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో సత్యదేవ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన చార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన జ్యోతిలక్ష్మి అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం వల్ల ఈ నటుడికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత నుండి ఈయన ఎక్కువ శాతం సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు.

కొంత కాలం క్రితం సత్యదేవ్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నెగిటివ్ పాత్ర ద్వారా కూడా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ "జీబ్రా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 22 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఆహా ఓ టీ టీ సంస్థ వారు ఏకంగా 5.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఆహా సంస్థ వారు ఇంత పెద్ద మొత్తంలో ధర పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేశారు అంటే ఈ మూవీ చాలా బాగుంది ఉంటుంది ... అందుకే ఇంత ధర పెట్టి ఈ మూవీ ని అహ సంస్థ వారు కొనుగోలు చేశారు అనే వాదనను కొంత మంది జనాలు వినిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాళ్లు తమన్ పై కేసు వేస్తారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>