Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcc6511fd-a7f1-4e13-997e-9e7baf88dc40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcc6511fd-a7f1-4e13-997e-9e7baf88dc40-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు వరుసగా సూపర్ ఇట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమై ఇండస్ట్రీలో కనుమరుగైపోతూ ఉంటారు. ఇక ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఇక హిట్టు అనే పదానికి మాత్రం చాలా దూరం అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు ఇలా విజయాలకు దూరమైన వారు ఉన్నారు. అలాంటి వారిలో రామ్ పోతినేని కూడా ఒకరు. కెరిram{#}Variar;ismart shankar;Red;ram pothineni;Air;Tollywood;puri jagannadh;Industry;Cinemaఇంకెలాంటి సినిమా చేయాలి.. హిట్టుకు దూరమై.. ఆందోళనలో పడ్డ రామ్ పోతినేని?ఇంకెలాంటి సినిమా చేయాలి.. హిట్టుకు దూరమై.. ఆందోళనలో పడ్డ రామ్ పోతినేని?ram{#}Variar;ismart shankar;Red;ram pothineni;Air;Tollywood;puri jagannadh;Industry;CinemaSat, 16 Nov 2024 10:30:00 GMTసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు వరుసగా సూపర్ ఇట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమై ఇండస్ట్రీలో కనుమరుగైపోతూ ఉంటారు. ఇక ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఇక హిట్టు అనే పదానికి మాత్రం చాలా దూరం అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు ఇలా విజయాలకు దూరమైన వారు ఉన్నారు. అలాంటి వారిలో రామ్ పోతినేని కూడా ఒకరు.


 కెరియర్ తొలినాళ్లలో వరుసగా సూపర్ హిట్ లు సాధించి ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్. కానీ ఆ తర్వాత మాత్రం అతనికి బ్యాడ్ లకు వెంటాడుతూనే ఉంది. ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. సినిమా కోసం ఇక ఎంతలా తనను తాను మార్చుకున్న.. ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోతున్నాడు. మధ్యలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టాడు  అయితే ఇది కేవలం గాలి వాటానికి మాత్రమే వచ్చిన విజయం అని అందరూ ట్రోలింగ్ కూడా చేశారు.


 అయితే ఈ ట్రోలింగ్ తప్పు అని నిరూపించాలనుకున్నాడు రామ్ పోతినేని. ఇక ఆ తర్వాత రెడ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత ద వారియర్ అనే సినిమాతో వచ్చిన ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకొని.. ఆ నిర్మాతలకు నష్టాలే మిగిల్చింది. ఇక ఆ తర్వాత ఏకంగా బోయపాటితో స్కంద అనే సినిమాలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇక తనకు చాన్నాళ్ల తర్వాత హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ నే మళ్లీ నమ్ముకుని ఈ సినిమాకు సీక్వల్ చేశాడు. ఈసారైనా హిట్టు దక్కుతుందనుకుంటే మళ్లీ రామ్ పోతినేని కి నిరాశ ఎదురయింది. ఇలా హిట్టు అనే పదానికి ప్రతి సినిమాతో అంతకంతకు దూరమైపోతున్నాడు. దీంతో అభిమానులు కూడా నిరాశలో మునిగిపోతున్నారు. రామ్ పోతినేని కి ఒక మంచి హిట్ దక్కితే బాగుండు అని కోరుకుంటున్నారు. మరి ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకొని ఇప్పటికైనా విభిన్నమైన కథలను ఎంచుకొని రామ్ రిస్క్ చేసి హిట్టు కొడతాడా లేదా చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నందమూరి అభిమానులను టెన్షన్ పెడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ..అసలు తెరవెనక ఏం జరుగుతుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>