PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-raghu-rama-krishnam-raju-f03a72c7-3d44-4011-9e28-a88e77bf498e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-raghu-rama-krishnam-raju-f03a72c7-3d44-4011-9e28-a88e77bf498e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవుల పంపకాల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంత్రివర్గ విస్తరణ జరగగా.. ఆ తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది కూటమి సర్కార్. రెండు విడతల్లో కూటమి ప్రభుత్వం... నామినేటెడ్ పదవులను భర్తీ చేసేసింది. ఇందులో జనసేన తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీల నేతలు ఉన్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. raghu rama krishnam raju {#}Janasena;raj;YCP;CBN;Andhra Pradesh;king;Telangana Chief Minister;Assembly;Government;Newsచంద్రబాబు షాక్‌..ఆ పదవి నాకొద్దు వద్దంటున్న రఘరామ ?చంద్రబాబు షాక్‌..ఆ పదవి నాకొద్దు వద్దంటున్న రఘరామ ?raghu rama krishnam raju {#}Janasena;raj;YCP;CBN;Andhra Pradesh;king;Telangana Chief Minister;Assembly;Government;NewsFri, 15 Nov 2024 00:29:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పదవుల పంపకాల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంత్రివర్గ విస్తరణ జరగగా..  ఆ తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది కూటమి సర్కార్. రెండు విడతల్లో కూటమి ప్రభుత్వం... నామినేటెడ్ పదవులను భర్తీ చేసేసింది. ఇందులో జనసేన తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీల నేతలు ఉన్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు.

 
ఇక నామినేటెడ్ పదవులు పూర్తయినా కూడా రఘురామకృష్ణ రాజుకు ఇలాంటి పదవి దక్కలేదు. దీంతో ఆయనకు ఏ పదవి రాదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రఘురామకృష్ణ రాజుకు.. నామమాత్రపు ఒక పోస్టు అప్పగించారు చంద్రబాబు నాయుడు. అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్. తాజాగా పేరు ప్రకటించి ఆయనను  ఏకగ్రీవంగా కూడా ఎన్నుకుంది అసెంబ్లీ. దీంతో తాజాగా బాధ్యతలు కూడా తీసుకున్నారు  రఘురామకృష్ణం రాజు.

 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి రఘురామకృష్ణ రాజుకు ఎక్కడా కూడా నచ్చలేదట. కేంద్రమంత్రి స్థాయి కలిగిన తనకు.... డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఏంటని... ఆగ్రహంతో ఉన్నారట రఘురామకృష్ణం రాజు.  పైకి తన బాధను చెప్పకపోయినా... లోలోపల బాధపడుతున్నారట. దానికి తగ్గట్టుగానే వైసీపీ పార్టీ కూడా రఘురామకృష్ణ రాజ్ ను ట్రోలింగ్ చేస్తోంది. వైసీపీలో ఉంటే మంచి పదవులు ఇచ్చే వాళ్ళమని.. కూటమిలోకి వెళ్లి ఇప్పుడు చిన్న పదవులు అనుభవిస్తున్నాడని.. ఒక ఆట ఆడుకుంటున్నారు.

 ఇక ఈ పోస్టులు రఘురామకృష్ణరాజు వరకు కూడా వెళ్లాయి. అయితే... ఈ స్పీకర్ పదవి తనకు వద్దని చెప్పలేక... ఆ పదవిలో ఉండలేక రఘురామకృష్ణ రాజు చాలా ఇబ్బంది పడుతున్నారట. ప్రస్తుతానికి అయితే ఆ బాధ్యతలు తీసుకొని... అవసరాన్ని బట్టి వ్యవహరించాలని రఘురామకృష్ణ రాజు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లిన రఘురామకృష్ణ రాజుకు ఉండి  అసెంబ్లీ టికెట్ ఇచ్చింది టిడిపి. దీంతో అక్కడ ఆయన అవలీలగా విజయం సాధించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రబాబు షాక్‌..ఆ పదవి నాకొద్దు వద్దంటున్న రఘరామ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>