MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya50efc2cc-c288-4da8-b2d8-9ae460ff4edb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya50efc2cc-c288-4da8-b2d8-9ae460ff4edb-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఇంత కాలం పాటు ఈ సినిమా యొక్క షూటింగ్ను ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ రోజు అనగా నవంబర్ 15 వ తేదీన ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ అలాగే ఈ మూవీ కి టైటిల్ ని కూడా ఖరారు చేసింది. ఈ మూవీ కి ఈ సినిమా బృందం వారు డాకు మహారాజ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసింది. ఇక ఈ మూవీ టీజర్ కూడా Balayya{#}lion;Event;surya sivakumar;Bobby;November;Balakrishna;Cinema;nagaడాకు మహారాజ్ : కంగారులో ఇంటర్వెల్ ట్విస్ట్ రివిల్ చేసిన నాగ వంశీ.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది..?డాకు మహారాజ్ : కంగారులో ఇంటర్వెల్ ట్విస్ట్ రివిల్ చేసిన నాగ వంశీ.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది..?Balayya{#}lion;Event;surya sivakumar;Bobby;November;Balakrishna;Cinema;nagaFri, 15 Nov 2024 11:46:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఇంత కాలం పాటు ఈ సినిమా యొక్క షూటింగ్ను ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ రోజు అనగా నవంబర్ 15 వ తేదీన ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ అలాగే ఈ మూవీ కి టైటిల్ ని కూడా ఖరారు చేసింది. ఈ మూవీ కి ఈ సినిమా బృందం వారు డాకు మహారాజ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసింది.

ఇక ఈ మూవీ టీజర్ కూడా అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం , అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ మరియు టైటిల్ విడుదల కోసం ఓ ఈవెంట్ ను నిర్వహించింది. అందులో ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... ఈ టీజర్ లో మీకు చూపించిన సన్నివేశాలు జేస్ట్ శాంపిల్. సినిమాలో ఉన్న చాలా సన్నివేశాల నుండి ఈ సినిమా టీజర్ ను తయారు చేశాం. ఈ టీజర్ కి చాలా రెట్లు సినిమా అద్భుతంగా ఉండబోతుంది అని అన్నాడు. అలాగే ఈ మూవీ లో ముఖ్యంగా ఐదు బ్లాక్స్ ఉంటాయి. అవి అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి అని చెప్పాడు.

అలాగే ఈ మూవీలో ఇంట్రవెల్ సన్నివేశం గురించి నాగ వంశీ మాట్లాడుతూ ... ఈ సినిమాలోని ఇంట్రవెల్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఓకే సీన్లో ఒక వైపు బాలయ్య గారు , మరోవైపు బాబి డియోల్ గారు ఉంటారు. ఆ సీన్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది అని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. నాగ వంశీ అలా చెప్పడంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా ఇంట్రవెల్ సన్నివేశంపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సినిమాల్లో నటించిన హీరోయిన్‌ల‌నే లవ్ చేస్తే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>