Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jr-ntr-couldnt-even-beat-nanic0e9422e-68ad-470f-afd0-9830fd225556-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jr-ntr-couldnt-even-beat-nanic0e9422e-68ad-470f-afd0-9830fd225556-415x250-IndiaHerald.jpgఈ సినిమాకు టైటిల్ గా పారడైస్ అని ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ అనుకోగానే అనౌన్స్ చేయడానికి ముందే లీక్ అవ్వడం నాని అండ్ టీం కి షాక్ ఇచ్చింది. ఐతే ఈ టైటిల్ లీక్ పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా అప్సెట్ అవుతూ సోషల్ మీడియాలోNani {#}Nani;Vijayadashami;srikanth;Dussehra;Success;Director;Cinemaనాని శ్రీకాంత్.. పారడైస్ ప్లానింగ్ లీక్..!నాని శ్రీకాంత్.. పారడైస్ ప్లానింగ్ లీక్..!Nani {#}Nani;Vijayadashami;srikanth;Dussehra;Success;Director;CinemaFri, 15 Nov 2024 23:33:00 GMTన్యాచురల్ స్టార్ నాని దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. దసరా తో తనకు 100 కోట్ల సినిమా అందించిన శ్రీకాంత్ తో మరో కథ రెడీ చేసుకోమని చెప్పాడు నాని. శ్రీకాంత్ కూడా నాని చెప్పీంట్టుగా మరో అద్భుతమైన కథ సిద్ధం చేశాడు. దాంతో నాని సినిమాకు ఓకే అనేశాడు. ఐతే ఈ సినిమాను దసరా నిర్మాతే నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు టైటిల్ గా పారడైస్ అని ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ అనుకోగానే అనౌన్స్ చేయడానికి ముందే లీక్ అవ్వడం నాని అండ్ టీం కి షాక్ ఇచ్చింది. ఐతే ఈ టైటిల్ లీక్ పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా అప్సెట్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. ఇదిలాఉంటే ప్రస్తుతం నాని హిట్ 3 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఐతే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పారడైస్ తో నాని శ్రీకాంత్ చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. సినిమా కోసం ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా చాలా భారీగా ఉండబోతుందని టాక్. దసరా ఇచ్చిన బూస్టింగ్ తో నాని ఈసారి శ్రీకాంత్ కు ఫ్రీ హాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరి నాని ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది చూడాలి. దసరా కాంబోలో రాబోతున్న ఈ పారడైస్ మీద ఫ్యాన్స్ కు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అసలే వరుస సక్సెస్ లతో దూసులెళ్తున్న నాని మరోసారి భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. అందులోనూ పారడైస్ రెండు భాగాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాని శ్రీకాంత్.. పారడైస్ ప్లానింగ్ లీక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>